తెలంగాణ

అమెరికాతో మాట్లాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడుల విషయాన్ని ఆ దేశ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రికి చంద్రశేఖర్ రావు శనివారం లేఖ రాశారు. ‘ఇటీవల కాలంలో అమెరికాలో జరుగుతున్న దురదృష్టకర సంఘటనలు మీకు తెలుసు. హైదరాబాద్‌కు చెందిన కూచిభొట్ల శ్రీనివాస్‌ను కాన్వాస్ రాష్ట్రంలో, వరంగల్ జిల్లాకు చెందిన మామిడాల వంశీచందర్‌రెడ్డిని కాలిఫోర్నియా రాష్ట్రంలో హత్య చేశారు. భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన వారిపై దాడులు జరుగుతున్నాయి’ అని కెసిఆర్ తన లేఖలో ప్రధానికి తెలిపారు. ఈ సంఘటనలు అమెరికాలో పని చేస్తున్న వారి బంధువులు, సన్నిహితులను ఆందోళనకు గురి చేస్తున్నాయని, వారి విశ్వాసాన్ని సడలిస్తున్నాయని కెసిఆర్ చెప్పారు. ప్రవాస భారతీయులు అమెరికా అభివృద్ధిలో, భారత దేశ అభివృద్ధిలో ఎంతటి పాత్ర పోషిస్తున్నారో మనకు తెలుసని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రవాస భారతీయుల పరిస్థితిపై అప్రమత్తం కావలసిన అవసరం ఉందని అన్నారు. అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి పరిస్థితులను చక్కదిద్దగలరని కోరుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు.