తెలంగాణ

సౌర విద్యుత్‌లో మేటి తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: దేశవ్యాప్తంగా అత్యధికంగా 1456 మెగావాట్ల సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేసి తెలంగాణ రాష్ట్రం ఛాంపియన్‌గా అవతరించిందని, మున్ముందు 5వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని విద్యుత్ శాఖా మంత్రి జి జగదీష్‌రెడ్డి చెప్పారు. శనివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సోమారపు సత్యనారాయణ, అల్లా వెంకటేశ్వరరెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జలవిద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. దిగువ జూరాల ద్వారా 240 ఎండబ్ల్యు జల విద్యుత్ ప్రాజెక్టును 2016 అక్టోబర్ 1న ప్రారంభించామని, పులిచింతల వద్ద 120 ఎండబ్ల్యు జల విద్యుత్ ప్రాజెక్టుల్లో ఒక యూనిట్‌ను నిరుడు సెప్టెంబర్ 29న ప్రారంభించామని అన్నారు. మిగతా మూడు యూనిట్లను 2017-18 సంవత్సరాల్లో ప్రారంభించాలని నిర్ణయించామని అన్నారు. తుపాకుల గూడెం, మేడిగడ్డ, తమ్మిడి హట్టిల వద్ద బహుళ ప్రయోజన బ్యారేజీలను సాగునీటి శాఖ ప్రతిపాదిస్తోందని, ఈ బ్యారేజీల వద్ద జల విద్యుత్ ప్రాజెక్టులను చేపట్టే అవకాశం ఉందని అన్నారు.
కొత్త సాంకేతికతను ప్రాజెక్టులకు వినియోగిస్తామని, ఇటీవల తాము చైనా పర్యటనకు వెళ్లినపుడు అక్కడ జల విద్యుత్ - సౌరవిద్యుత్ కలిపి ఉమ్మడిగా ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నారని అయితే వాటి వ్యయం చాలా ఎక్కువగా ఉందని, రానున్న రోజుల్లో సోలార్ ప్యానళ్ల ధర బాగా తగ్గే వీలుందని, అపుడు సౌరవిద్యుత్‌ను మరింత పెంచేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ సౌర విద్యుత్‌ను తెలంగాణలో పెంచాలని కోరారు. జలగం వెంకటరావు మాట్లాడుతూ రెండోదశ పునరుత్పత్తి ద్వారా విద్యుత్‌కు జలాలను వినియోగించుకునే ఆలోచన ఉందా అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తారా అని సోమారపు సత్యనారాయణ ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి వారికి బదులిస్తూ అవకాశం ఉన్న ప్రతి చోట విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను అనే్వషిస్తామని పేర్కొన్నారు.