తెలంగాణ

నియోజకవర్గానికో బిసి గురుకులం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఒక బిసి గురుకులాన్ని ఈ విద్యాసంవత్సరం నుండి ప్రారంభిస్తున్నట్టు బిసి సంక్షేమ మంత్రి జోగు రామన్న చెప్పారు. గోవర్ధన్ బాజిరెడ్డి, గంగుల కమలాకర్, చింతా ప్రభాకర్, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ ఈ ఏడాది 119 బిసి గురుకులాలను ప్రారంభిస్తున్నామని, రానున్న రోజుల్లో వాటిని పిజి స్థాయి వరకూ విస్తరింపచేస్తామని చెప్పారు. ప్రతి మండలంలో ఒక గురుకులం పెట్టినా సరిపోని పరిస్థితి ఉందని, కెజి నుండి పిజి వరకూ ఉచిత విద్యను అందించే క్రమంలో ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో ఇది మొదటి మెట్టు మాత్రమేనని, ఇది అంతం కాదని, ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. గురుకులాల ఏర్పాటుకు అనువైన స్థలాల గుర్తింపు సాగుతోందని, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల ప్రక్రియ కూడా మొదలైందని అన్నారు. మూతపడిన ఇంజనీరింగ్ కాలేజీల భవనాలను గురుకులాల కోసం తీసుకోవాలని బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. ప్రతి అసెంబ్లీలో బాలికలకు ఒకటి, బాలుర కోసం మరొకటి గురుకులాలను మంజూరు చేయాలని కోరారు. అదే విధంగా బిసిల కోసం డిగ్రీ కాలేజీలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. సిబ్బంది కొరత లేకుండా అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించాలని అన్నారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ పైసా బడ్జెట్ ఇవ్వకుండా గురుకులాలను ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. గురుకులాల్లో బిసి, ఎస్సీ, ఎస్టీ, అనాధ బాలబాలికలతో పాటు ఇబిసి వారికి కూడా అడ్మిషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు.