తెలంగాణ

గర్భం దాల్చిన గిరిజన విద్యార్థిని?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 18: వరంగల్ నగరంలోని రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉంటూ తొమ్మిదవ తరగతి చదువుకుంటున్న ఒక మైనర్ గిరిజన విద్యార్థి ని నెలతప్పింది. ఆమెతోపాటు స్పోర్ట్స్ హాస్టల్ ఉంటున్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పదవ తరగతి విద్యార్థి దీనికి కారకుడని సమాచారం. గిరిజన విద్యార్థిని గర్భందాల్చిన విష యం తెలిసి స్పోర్ట్స్ హాస్టల్ అధికారులు ఐదురోజుల కిందట వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో ఉంటున్న ఆమె తండ్రిని పిలిపించి, విషయం తెలిపి ఆమెను తీసుకెళ్లమని చెప్పారని తెలిసింది. బాలిక గర్భం దాల్చినట్లు బయటకు పొక్కితే పరువు పోతుందని, ఆమెకు పెళ్లిచేయడం కష్టమం టూ తండ్రిని బెదిరించినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో ఆయన తన కుమార్తెను ఇంటికి తీసుకువెళ్లి స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మైనర్ విద్యార్థిని గర్భం దాల్చడానికి కారకుడైన విద్యార్థిని పదవతరగతి పరీక్షల కారణంగా హాస్టల్‌లోనే ఉంచి పరీక్షల అనంత రం ఇంటికి పంపించివేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. గిరిజన బాలిక గర్భందాల్చిన సంఘటనపై స్పోర్ట్స్ హాస్టల్ అధికారులను మీడి యా ప్రశ్నిస్తే మొదట అటువంటిది ఏమీలేదని చెప్పి, ఆ తరువాత సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. బాలిక తండ్రిని శనివారం మీడియా ప్రతినిధులు కలిస్తే తన కుమార్తె ఆరోగ్యం బాగాలేదని చెప్పి హాస్టల్ అధికారులు తనవెంట పంపించారని చెబుతూనే, జరిగిందేదో జరిగిపోయిందని వ్యాఖ్యానించడం విశేషం.