తెలంగాణ

వారసత్వ ఉద్యోగాల హామీల అమలులో విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల విషయమై ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కెసిఆర్ విస్మరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవ న్ రెడ్డి, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శనివారం వారు విలేఖరులతో మాట్లాడుతూ, అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే కెసిఆర్ ఈ అంశంపై నిర్ణయం తీసుకోకుండా ఉద్ధేశ్యపూర్వకంగానే జాప్యం చేశారని, 2014లోనే దీనిని అమలు చేస్తే సమస్యలు ఉత్పన్నమయ్యేవి కావని అన్నారు. ఈ విషయంలో సింగరేణి కార్మికులకు కెసిఆర్ క్షమాపణ చెప్పడంతో పాటు వారికి వారసత్వ ఉద్యోగాలను కల్పించే విషయమై చర్యలుతీసుకోవాలని, సుప్రీం కోర్టులో వారికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. టిపిసిసి అధికార ప్రతినిధి నగేష్ ముదిరాజ్ మాట్లాడుతూ, బిసిలపై కపట ప్రేమ కురిపిస్తున్న కెసిఆర్ సర్కారు బడ్జెట్‌లో వారికి ఆశించినట్లుగా నిధులు కేటాయించలేదని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, రాజిరెడ్డి మాట్లాడుతూ, ఏడాదిలోగా హైదరాబాద్‌లో 1.25 లక్షల బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం శుద్ధ అబద్ధమని, సత్యదూరమైన ఇటువంటి మాటలతో ప్రజలను ఇంకా మోసగించేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ నిజంగా ఈ హామీని నిలబెట్టుకుంటే 2019 ఎన్నికల్లో స్వయంగా తామే తెరాసను గెలిపించేందుకు కృషి చేస్తామని, సర్కారుకు దమ్ముంటే తమ సవాలును స్వీకరించాలని వారు స్పష్టం చేశారు.