తెలంగాణ

బంగారు తెలంగాణ కాదు.. తాగుబోతుల తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: ‘బంగారు తెలంగాణ కాదు, తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారు..’ అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఆదాయంపై ఆధారపడిందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బిజెపి రాష్ట్ర శాఖ ఆదివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన చర్చలో మురళీధర్ రావు ప్రధానోపన్యాసం చేశారు. పెద్ద నోట్ల రద్దు వల్ల భూముల క్రయ, విక్రయాలు తగ్గాయని, దీంతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందని చెప్పడంలో వాస్తవం లేదని మురళీధర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఆదాయంతో, పెట్రోలు సుంకంతో నడుస్తున్నదని విమర్శించారు. 2016-17లో ప్రభుత్వానికి మద్యంతో 14 వేల కోట్ల ఆదాయం రాగా, రాబోయే ఆర్థిక సంవత్సరంలో 19 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఆశిస్తున్నదని అన్నారు. బంగారు తెలంగాణ సంగతి ఏమో కానీ తాగుబోతు తెలంగాణగా మారుస్తున్నదని ఆయన విమర్శించారు. యువతను మద్యం వైపు ఆకర్షించేలా చేస్తున్నదని ఆయన తెలిపారు. మద్యపానంపై రాష్ట్ర ప్రభుత్వ విధానం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వృద్ధిరేటు 14శాతం కంటే ఎక్కువ ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్నందున జిఎస్‌టి పరిహారం కావాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరలేదని అన్నారు. 2016-17లో 32 వేల కోట్లు రెవిన్యూ ఆదాయం ఉన్నట్లు చూపించారని, 2017-18లో ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందని అన్నారని ఆయన తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఈ రెండున్నరేళ్లలో ఏ ఒక్క పని చేయలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వల్ల బ్యాంకులు లాభపడ్డాయే కానీ రైతులు బాగుపడలేదన్నారు.
దేశం మొత్తంలో తెలంగాణలోనే ఎక్కువ సంఖ్యలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో 1700మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.
ఎగ్జిబిషన్‌లా ఇళ్లు..
ముఖ్యమంత్రి కెసిఆర్ 1400 ఇళ్లు ఎగ్జిబిషన్ తరహాలో నిర్మించి, జిల్లాల నుంచి వచ్చే వారికి అవి చూపిస్తున్నారని మురళీధర్ రావు తెలిపారు. రెండు లక్షల ఇళ్లు నిర్మించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని ముఖ్యమంత్రి చెప్పడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఇండ్లు కట్టలేరు, ఓట్లు అడగలేరని అన్నారు. మిషన్ భగీరథ కేవలం ప్రచారంలో ఉంది తప్ప ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదని ఆయన విమర్శించారు.