తెలంగాణ

విజిలెన్స్ నివేదికను బయటపెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: జాయింట్ వెంచర్ (జెవి) ప్రాజెక్టులపై విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికను తక్షణం బయటపెట్టాలని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి సిఎం కెసిఆర్‌ను డిమాండ్ చేశారు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జెవి ప్రాజెక్టులపై ఏర్పాటైన విజిలెన్స్ విచారణ కమిటీ తన నివేదికను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డానికి ఒక రోజు ముందు 2014 మే 31న సమర్పించిందని తెలిపారు. ఆ నివేదికలో ప్రైవేటు సంస్థలకు చెందిన వ్యక్తులతో పాటు అప్పటి ఐఎఎస్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. ఆయా కార్పొరేట్ సంస్థలకు కేటాయించిన జెవి ప్రాజెక్టు భూములను వెనక్కి తీసుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. టిటిడిపి సభ్యులను అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడేందుకు వీలు లేకుండా తమ గొంతునొక్కిన కారణంగా బహిరంగ లేఖ ద్వారా తెలియజేస్తున్నట్లు రేవంత్ ఆ లేఖను పత్రికలకు విడుదల చేశారు.
జెవి వెంచర్ల కోసం కార్పొరేట్ సంస్థలు తీసుకున్న విలువైన భూములను వెనక్కి తీసుకుని ఆ ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించాలని, జెవి ప్రాజెక్టుల నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ వాటా మొత్తాన్ని విజిలెన్స్ నివేదిక సిఫార్సు చేసిన మేరకు వడ్డీతో సహా వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అవినీతిలో మీకు భాగం లేకపోతే జెవి ప్రాజెక్టులపై విజిలెన్స్ నివేదికను తక్షణం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు సంస్థలకు ఇప్పటికే జారీ చేసిన ఎన్‌ఓసిలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజానికి నష్టం కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకుంటే దానిని అడ్డుకుంటామని, న్యాయస్థానం తలుపు తట్టక తప్పదని ఆయన ప్రభుత్వానికి ఆ లేఖలో తెలిపారు.