తెలంగాణ

నిట్ విద్యార్థి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 19: వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి (నిట్) చెందిన ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థి సాంకేతిక్ కుమార్ సూర్యవంశీ ఆదివారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నిట్ క్యాంపస్‌లోని 1-కె హాస్టల్‌లోని ఐదవ అంతస్తు నుంచి కిందపడి ఉండడాన్ని గమనించిన సహచర విద్యార్థులు, నిట్ అధికారులు అతనిని హుటాహుటిన నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స జరుగుతుండగానే మరణించాడు. మహారాష్టల్రోని లాతూర్‌కు చెందిన సాంకేతిక్ కుమార్ సూర్యవంశీ గత రెండు, మూడురోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు సహచర విద్యార్థుల సమాచారం. ఆదివారం ఉదయం స్నేహితులతో కలిసి ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకుని మధ్యాహ్నం 12 గంటలకు హాస్టల్‌కు వచ్చాడు. రెండుగంటల సమయంలో సాంకేతిక్ కుమార్ హాస్టల్ పైనుంచి కిందపడి తీవ్రగాయాలతో ఉండడాన్ని గమనించిన సహచర విద్యార్థులు, నిట్ అధికారులు అతనిని ప్రైవేటు ఆసుపత్రికి తరలిచారు. తలకు బలమైన గాయాలు తగలటంతోపాటు శరీరంలోని ఇతర భాగాలకు కూడా బలమైన గాయాలు తగలడంతో చికిత్స జరుగుతుండగానే అతను మృతి చెందాడు. సూర్యవంశీ మరణించిన విషయాన్ని లాతూర్‌లోని కుటుంబ సభ్యులకు నిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. సూర్యవంశీ కళ్లు తిరిగి పైనుంచి ప్రమాదవశాత్తు కిందకు పడిపోయాడా, లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తెలియడం లేదని నిట్ అధికారులు, విద్యార్థులు చెప్పారు. తల్లిదండ్రులు వచ్చాక వారినుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.