తెలంగాణ

భీంసింగ్‌ది లాకప్ డెత్ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: హైదరాబాద్‌లోని మంగళహాట్ పోలీస్‌స్టేషన్‌లో భీంసింగ్ అనే వ్యక్తి మరణం లాకప్‌డెత్ కాదని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో సోమవారం హోంశాఖ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్‌సభ్యుడు రాంమోహన్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించగా, వెంటనే హోంమంత్రి స్పందించారు. దిలీప్ అనే వ్యక్తి, భీంసింగ్ అనే వ్యక్తి మధ్య గొడవలో భీంసింగ్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారన్నారు. భీంసింగ్‌కు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఆధార్‌కార్డు తీసుకురమ్మని పోలీసులు సూచించగా, అతను ఇంటికివెళ్లి ఆధార్‌కార్డు తెచ్చారన్నారు. ఆ తర్వాత మూత్రం పోసేందుకు వెళ్లిన భీంసింగ్ గుండెపోటుకు గురయ్యారని, వెంటనే మరణించాడని తెలిపారు. భీంసింగ్‌కు సంబంధించిన ఫుటేజ్‌ను తాను పరిశీలించానని మంత్రి చెప్పారు. మేజిస్ట్రేట్ నేతృత్వంలో పోస్ట్‌మార్టం జరిగిందని, పోస్ట్‌మార్టం నివేదికలో కూడా భీంసింగ్ గుండెపోటు వల్లనే మరణించాడని వెల్లడైందని హోంమంత్రి వివరించారు. మానవతాదృక్పథంతో భీంసింగ్ కుటుంబానికి ఐదులక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తున్నామని, ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తున్నామని హోంమంత్రి నాయిని తెలిపారు.