తెలంగాణ

గొర్రెల పెంపకానికీ నిధులిస్తున్న కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, మార్చి 20: గొర్రెల పెంపకానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదనడం విడ్డూరంగా ఉందని జెజెపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ స్థాయిలో వివక్ష లేకుండా అన్ని రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేస్తుందని చెప్పారు. కేంద్రం నిధుల నుంచి పథకాలను అమలు చేస్తూ వాటి ప్రస్తావన చేయకపోవడం సరికాదన్నారు. కేరళ సిఎం తమ పార్టీపై తలాతోకాలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎవర్ని సిఎం చేయాలో సిపిఎం అనుమతి అవసరం లేదన్నారు. కేరళలో హత్యారాజకీయాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ప్రజలు వామపక్ష పార్టీల భావజాలాలను చీత్కరించుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేరళను బిజెపి హస్తగతం చేసుకుంటుందని జోస్యం చెప్పారు.
ప్రజలను ఆకర్షించేవారే బాహుబలి: విహెచ్
ప్రజలను ఎవరు ఆకర్షించగలుగుతారో వారే బాహుబలి అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్‌లో చాలా మంది బాహుబలులు ఉన్నారని, అసెంబ్లీలో మాటలు వేరని, క్షేత్ర స్థాయిలో జనం సమస్యలు తెలుసుకొని వారికి అండగా ఉండాల్సి ఉందన్నారు. నీటి సమస్య, తాగునీటిలో మురుగునీరు ప్రవహిస్తోందని ఆరోపించారు. తెరాస ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలయిందని, అసెంబ్లీ సమావేశాల అనంతరం అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ నేతలు పర్యటించేలా కార్యాచరణ రూపొందించాలని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి లేఖ రాసినట్టు చెప్పారు. జనాభా ప్రాతిపదికన బిసిలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ఉత్తర్‌ప్రదేశ్‌కు మాత్రమే ప్రధానిలా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ, ఏపి రైతులు కేంద్రానికి కనబడరా అని ప్రశ్నించారు. యుపిలోనే రుణమాఫీ చేస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు.