తెలంగాణ

మరో ఐదువేల పాఠశాలలు ఇంగ్లీష్ మీడియంలోకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: దశల వారిగా ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ విద్యా సంవత్సరం ఐదువేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నట్టు ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రస్తుతం ఐదువేల పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతోందని, ఈఏడాది మరో ఐదువేల పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన ప్రారంభం అవుతుందని అన్నారు. మహిళా సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశం జరిపి త్వరలోనే అంగన్‌వాడీ కేంద్రాలను కేజీ నుంచి నాలుగవ తరగతి పాఠశాలలుగా మార్చేందుకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేజీ టు పీజీ విద్యా పథకం అమలు గురించి శాసన సభలో మంగళవారం అడిగిన ప్రశ్నకు సమాధానంగా కడియం శ్రీహరి ఈ విషయం తెలిపారు. పాఠశాలల్లో అవసరం అయిన స్థలాలు ఉంటే అంగన్‌వాడీ కేంద్రాలను పాఠశాలల ఆవరణలోకి తరలించనున్నట్టు చెప్పారు. అంగన్‌వాడిల్లో కేజీ నుంచి నాలుగవ తరగతి వరకు చదువు నేర్పించి, ఐదవ తరగతి నుంచి గురుకుల పాఠశాల్లో చేర్పించడం ద్వారా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యా పథకం విజయవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని కడియం శ్రీహరి తెలిపారు. కేజీ టు పీజీ విద్యా పథకం అమలులో భాగంగా రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఎస్‌సిలకు 104, ఎస్‌సి మహిళలకు ప్రత్యేక డిగ్రీ కాలేజీలు 30, ఎస్‌టిల కోసం 51 గురుకుల పాఠశాలలు, మిబిసిల కోసం గురుకుల పాఠశాలలు నాలుగు, ఒక గురుకుల జూనియర్ కాలేజీ, 18 గురుకుల జూనియర్ కాలేజీలు ప్రారంభించనున్నట్టు చెప్పారు. బిసి మహిళల కోసం ప్రత్యేకంగా ఒక గురుకుల డిగ్రీ కాలేజీ, మైనారిటీల కోసం 71గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. 2017-18 సంవత్సరంలో బిసిల కోసం గురుకుల పాఠశాలలు 119, మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు 130, మొత్తం 529 గురుకులాలు ప్రారంభించనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో డిగ్రీ కాలేజీల ఏర్పాటు కోసం ప్రభుత్వం పరిశీలన జరుపుతోందని, నివేదిక అందిన తరువాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరు దశాబ్దాల్లో తెలంగాణలో 298 గురుకులాలు ఉంటే, టిఆరఎస్ ప్రభుత్వం రెండేళ్లలోనే 529 గురుకుల పాఠశాలలు ప్రారభింస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని 34 ప్రతిపాదనలు వచ్చినట్టు కడియం శ్రీహరి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కాగితాల మీదనే డిగ్రీ కాలేజీలు మంజూరు చేశారని, వాటికి ఇప్పుడు సౌకర్యాలు కల్పించనున్నట్టు చెప్పారు.
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ కొందరు న్యాయ స్థానాలకు వెళ్లడం వల్ల ఈ ప్రక్రియ నిలిచిపోయిందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకొని కేసు ఉప సంహరించుకునేట్టు చేయాలని అన్నారు.