తెలంగాణ

పదో తరగతి ఇంగ్లీష్ పేపర్ లీక్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: పదో తరగతి ఇంగ్లీషు పరీక్ష పేపర్ -1 మంగళవారం నాడు లీక్ అయిందనే వార్తలు విద్యార్థులను బెంబేలెత్తించగా, విద్యాధికారుల్లో కలకలం రేపింది. గత మూడు రోజుల నుండి పదో తరగతి పరీక్ష పత్రాలు లీక్ అవుతున్నాయనే వదంతులు వినిపిస్తున్నాయి. ఆంధ్రాలోనూ మూడు పరీక్షల పేపర్ల లీక్‌పై వదంతులు వచ్చాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఆంగ్ల ప్రశ్నపత్రం-1 ఏకంగా వాట్సప్ గ్రూప్‌ల్లో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశం అయింది. పరీక్ష జరుగుతున్న సమయంలోనే జిల్లా వ్యాప్తంగా వాట్సప్ గ్రూప్‌ల్లో ఈ ప్రశ్నపత్రం ప్రత్యక్షం అయింది. దాంతో జిల్లా విద్యాశాఖాధికారులు అప్రమత్తమయ్యారు. పేపర్ లీక్‌కు మూలాలు ఖమ్మం జిల్లాలో ఉన్నాయని తేలడంతో డిఇఓ ఝాన్సీలక్ష్మీబాయి సంబంధిత అధికారులతో మాట్లాడారు. అనంతరం ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. వెంటనే స్థానిక పోలీసులు డిఇఓ కార్యాలయానికి చేరుకుని లీక్‌పై ఆరా తీసినట్టు తెలిసింది. ప్రశ్నపత్రం ఎక్కడ ఎలా లీక్ అయిందనే అంశంపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని డిఇఓ పోలీసులకు తేల్చి చెప్పారు. అయితే ప్రశ్నపత్రం వాట్సప్ గ్రూప్‌ల్లో ఉందన్న దానిపై అంగీకరించారు. పరీక్ష ఉదయం 9.30కు ప్రారంభం అయిందని, ప్రశ్నపత్రం 11.30కి వెలుగు చూసిందని, దానిని లీక్ అని ఎలా అంటారని పాఠశాల విద్యాశాఖాధికారులు వాదిస్తున్నారు. పరీక్ష ముందుగా పూర్తి చేసి బయటకు వచ్చిన తర్వాత వాట్సప్ గ్రూపుల్లో పెట్టారా అనే కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులను చివరి నిమిషం వరకూ పరీక్ష హాలులోనే ఉంచుతున్నారని గంట ముందు బయటకు వచ్చి ఈ పనిచేసేందుకు అవకాశం లేదని కూడా అధికారులు పేర్కొంటున్నారు. పరీక్ష కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైనా ఇలా చేశారా అనేది తేలాల్సి ఉంది. పేపర్ లీక్‌పై అన్ని కోణాల్లో ఖమ్మం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక వేళ నిజంగానే లీక్ అయితే ఎన్ని గంటలకు లీక్ అయింది, దానిని ఎవరు లీక్ చేశారు? వాట్సప్ గ్రూపుల్లో పెట్టింది ఎవరు? వారికి పేపర్ కాపీ ఎలా అందింది అనే అంశాలపై దర్యాప్తు జరుగుతోందని ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్ గణేష్ పేర్కొన్నారు. కాగా లీక్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందిగా డిఇఓ సైతం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
సమగ్ర విచారణ: కడియం
పేపర్ లీక్ వార్తలపై సమ్రగ దర్యాప్తు జరపాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పోలీసులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టర్‌కు ఫోన్ చేసిన కడియం శ్రీహరి ఇందుకు సంబంధించి పోలీసుల ప్రాథమిక నివేదికపై విచారణ చేశారు. అనంతరం లోతైన దర్యాప్తు అవసరమని భావించిన ఉప ముఖ్యమంత్రి ఎక్కడ లీక్ అయిందో తెలుసుకోవాలని ఆదేశించారు. ఒక వేళ తప్పుడు ప్రచారం చేస్తే అందుకు బాధ్యులైన వారిపైనా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
పరీక్ష రద్దు కాదు
పరీక్షను రద్దు చేయడం లేదని పరీక్షల కమిషనర్ సురేందర్‌రెడ్డి చెప్పారు. కేవలం మాల్‌ప్రాక్టీస్ మాత్రమే జరిగిందని, పరీక్ష పేపర్ లీక్ కాలేదని ఆయన స్పష్టం చేశారు. కలెక్టర్ నివేదిక కూడా పరీక్ష పేపర్ లీక్ కాలేదని వచ్చిందని చెప్పారు.