తెలంగాణ

తెలంగాణకూ యోగి వస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: ఉత్తరప్రదేశ్‌లో ఆదిత్యనాథ్ యోగి తరహాలో తెలంగాణకూ యోగి రాబోతున్నారని అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. మంగళవారం అసెంబ్లీలో నీటి పారుదల శాఖ, విద్యుత్తు తదితర శాఖల పద్దుల (డిమాండ్ల)పై చర్చ జరిగింది. ఈ చర్చలో బిజెపి ఎమ్మెల్యే ప్రభాకర్ ప్రసంగిస్తూ తెలంగాణకూ యోగి రాబోతున్నారని అనగానే పాలక పక్షం సభ్యులు పలువురు ‘యోగి కాదు భోగి’ అని వ్యాఖ్యానించడంతో సభలో నవ్వుల జల్లు కురిసింది. ప్రభాకర్ తన ప్రసంగంలో ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉదయ్, ఉజ్వల వంటి పథకాలతో దేశానికి ఉజ్వలమైన భవిష్యత్తు రానున్నదని తెలిపారు. డిస్కాంలు నష్టాల ఊబిలో నడస్తున్నాయని అన్నారు. విద్యుత్తు కోతలు లేవని ప్రభుత్వం చెబుతున్నా, అప్రకటిత కోతలు కొనసాగుతున్నాయని విమర్శించారు.