తెలంగాణ

ఆస్తి పన్ను పెంపు తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను పెంచాల్సి ఉందని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారకరామారావు పేర్కొన్నారు. మున్సిపల్ పద్దులపై శాసనసభలో బుధవారం జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆస్తి పన్ను పెంచకపోతే మున్సిపాలిటీలకు అవసరమైన నిధులు లభించవని, దాంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఇబ్బంది అవుతుందన్నారు. 2017-18లో మున్సిపల్ వ్యవహారాలకు 5599 కోట్లు కేటాయించారని, ఇవికాకుండా మరో ఐదు వేల కోట్లు రుణాలు తదితర మార్గాల్లో సమకూర్చుకునేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. జిహెచ్‌ఎంసికి గతంలో ఏనాడూ లేనివిధంగా వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. అలాగే హైదరాబాద్ మహానగర తాగునీటి సంస్థకు 1420 కోట్లు కేటాయించామన్నారు. హైదరాబాద్‌లోని మూసి అభివృద్ధికి ‘మూసి రివర్ ఫ్రంట్ కార్పొరేషన్’ ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకోసం 500 కోట్లు ఇస్తామని మంత్రి వెల్లడించారు.
2017 జూన్ 2నాటికి తెలంగాణలోని 73 మున్సిపాలిటీలను బహిరంగ మలవిసర్జన లేని పట్టణాలుగా ప్రకటించనున్నట్టు కెటిఆర్ తెలిపారు. ఈ విషయంలో గతంలో దేశంలో 274 స్థానంలోవున్న హైదరాబాద్ గత ఏడాది 19వ స్థానానికి చేరిందని, వచ్చే ఏడాదికి మొదటి ఐదు నగరాల్లో ఒకటిగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న 1490 మురికివాడల్లో లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదించిన ఐదువేల కోట్ల రూపాయల ప్రణాళికలో ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో చెత్త చెదారాన్ని తొలగించేందుకు రెండువేల ఆటోలు ఉపయోగిస్తున్నామని, త్వరలో మరో 500 ఆటోలను కొనుగోలు చేయనున్నట్టు వివరించారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు త్వరలో ‘బిల్డింగ్ ట్రిబ్యునల్’ను ఏర్పాటు చేస్తున్నామని, రిటైర్డ్ జడ్జిని దీనికి హెడ్‌గా నియమిస్తామన్నారు. ఇలాఉండగా త్వరలో యూనిఫైడ్ సర్వీస్ బిల్లు తీసుకొస్తామని మంత్రి ప్రకటించారు. హైదరాబాద్‌లో నాలుగుచోట్ల ‘స్కైవే’లను నిర్మిస్తున్నామన్నారు. 390 కిలోమీటర్ల నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల్లో 12 వేల నిర్మాణాలను తొలగిస్తున్నామన్నారు. అలాగే హెరిటేజ్ భవనాలను కాపాడుతూ, వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్‌లో 150 కేంద్రాల్లో ఐదు రూపాయలకే అన్నం అందించే క్యాంటీన్లు ఏర్పాటు చేశామని మంత్రి కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని ‘గ్రీన్ సిటీ’గా మారుస్తున్నట్టు వెల్లడించారు.