తెలంగాణ

మూతపడ్డ పరిశ్రమలను తెరిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: తెలంగాణ రాష్ట్రంలో మూతపడ్డ చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలను తిరిగి తెరిపించాలని, ఇందుకు రాష్ట్రప్రభుత్వం నడుం కట్టాలని శాసనసభలో కాంగ్రెస్ సభ్యురాలు, మాజీ మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి కోరారు. పరిశ్రమల శాఖ డిమాండ్‌పై సభలో గురువారం జరిగిన చర్చలో పాల్గొంటూ, రాష్ట్రప్రభుత్వం కొత్తపరిశ్రమలను ఆహ్వానించడం మంచిదేనని, అయితే ఇప్పటికే ప్రారంభమై వివిధ కారణాల వల్ల మూతపడ్డ పాతపరిశ్రమలను పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకులకు మూడునెలలు కిస్తు కట్టకపోతే, ఎన్‌పిఎలుగా మారుతున్నాయని, విద్యుత్ చార్జీలు ఒకటిరెండు నెలలు చెల్లించకపోతే విద్యుత్తు కట్ అవుతోందని తెలిపారు. ఇలాంటి చిన్నచిన్న సమస్యల కారణంగా మూతపడ్డ పరిశ్రమలను తెరిపించడం వల్ల ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం రావడమే కాకుండా, ఉపాధికోల్పోయిన లక్షలాది మంది కార్మికులకు మళ్లీ ఉపాధి లభిస్తుందన్నారు. ఇందుకోసం ప్రత్యేక ఎస్‌ఎల్‌బిసి (రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ) సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని సూచించారు. చిన్నతరహా పరిశ్రమలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన 1025 కోట్ల ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌సి ఉపప్రణాళిక, ఎస్‌టి ఉపప్రణాళిక కింద ఇవ్వాల్సిన నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు.ప్రభుత్వం చెబుతున్నట్టు గత ఏడాది 51 వేల కోట్లపెట్టుబడితో 3327 పరిశ్రమలు వచ్చాయన్నది వాస్తవం కాదని, ఇందులో 21,856 కోట్లతో ఏర్పాటు చేసిన 87 పవర్‌ప్లాంట్లను కలపడం సరైందికాదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ ‘విశ్వనగరం’గా పేరుతెచ్చుకున్నదని గీతారెడ్డి తెలిపారు. బిహెచ్‌ఇఎల్, ఇసిఐఎల్ లాంటి పెద్దపరిశ్రమలు, వాటికి అనుబంధంగా చిన్నపరిశ్రమలు వచ్చాయని, వీటిపై పరోక్షంగా ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారన్నారు.