తెలంగాణ

తెలంగాణ పోలీస్‌కు ‘గోల్డెన్ పీకాక్’ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: తెలంగాణ పోలీసు శాఖకు ప్రతిష్ఠాత్మకమైన ‘గోల్డెన్ పీకాక్’ అవార్డు లభించింది. హైదరాబాద్ నగర పోలీసు విభాగం ‘హైద్‌కాప్’ అనే మొబైల్ యాప్ రూపొందించి ప్రజలకు మెరుగైన సౌకర్యాన్ని కల్పించినందుకు ఈ అవార్డు లభించిందని హైదరాబాద్ నగర పోలీసు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 18న దుబాయ్‌లో జరుగనున్న గోల్డెన్ పీకాక్ అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ పోలీసులకు ఈ అవార్డు అందజేయనున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఇ) సాంస్కృతిక శాఖ మంత్రి నాహ్యన్ చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేస్తారని తెలిపింది. గత ఏడాది ఏప్రిల్ 16న ‘హైద్‌కాప్’ పేరిట హైదరాబాద్ సిటీ పోలీసులు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యాప్‌ను తయారు చేశారు. సమాచారం, డేటా బేస్ వంటి వాటిని పోలీసు విభాగాల్లో అధికారులు వెంటనే పొందేందుకు వీలుగా ఈ యాప్‌ను డిజైన్ చేశారు. ఇందుకు అనుగుణంగా ఐటి అప్లికేషన్స్ ఆధారంగా విశే్లషణాత్మక నివేదికలు, అందుకు సంబంధించిన డేటాను స్మార్ట్ ఫోన్ల ఆధారంగా తక్షణమే తెలుసుకునేందుకు వీలుంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి.