తెలంగాణ

కార్పొరేషన్ల ఉద్యోగాలూ పిఎస్‌సి ద్వారానే భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: గతంలో గ్రూప్ 1, 2,3 ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా భర్తీ చేసే వారని, కానీ ఇప్పుడు అన్ని ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కార్పొరేషన్ ఉద్యోగాలను సైతం పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించినట్టు శుక్రవారం శాసన సభలో తెలిపారు. ప్రతి ఉద్యోగం పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారానే భర్తీ చేయనున్నట్టు చెప్పారు. త్వరలోనే అన్ని ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌లో మొత్తం 180 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, వీరిలో 110 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 70మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. పని భారాన్ని దృష్టిలో పెట్టుకుని ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికపై వివిధ కేటగిరిలలో 70 మంది సిబ్బందిని నియమించుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. పని భారానికి తగినట్టు సిబ్బందిని నియమించనున్నట్టు తుమ్మల తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్న తీరును అనేక రాష్ట్రాలు పరిశీలిస్తున్నాయని చెప్పారు.