తెలంగాణ

నియంత్రణ లేని విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: రాష్ట్రంలో విద్యారంగం రోజురోజుకూ నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్న చందంగా మారింది. ప్రతి ఏటా ప్రైవేటు స్కూళ్లలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుండగా, ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య అందుకు తగ్గ నిష్పత్తిలో పెరగడం లేదు. మొత్తంగా చూసుకుంటే ప్రైవేటు స్కూళ్లలోనే విద్యార్ధుల సంఖ్య ఎక్కువగా ఉంది. సర్కార్ నుండి ఎప్పటికైనా ఫీజుల నియంత్రణ ఉత్తర్వులు వస్తాయని తల్లిదండ్రులు, విద్యార్థుల ఎదురుచూపులు అడియాసలే అయ్యాయి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఫీజుల నియంత్రణపై సీరియస్‌గా ఉన్నామని అధికారులు వెల్లడించడం వినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గత పదేళ్లుగా చెబుతున్నా, ప్రభుత్వం నుండి ఉత్తర్వులు రాకపోగా, విద్యాసంవత్సరానికి ముందే ప్రైవేటు స్కూళ్లు అడ్మిషన్లను పూర్తి చేస్తున్నాయి. వచ్చే విద్యాసంవత్సరానికి అపుడే ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్లు పూర్తికాగా, నిబంధనలను ఉల్లంఘించి కూడా ధైర్యంగా సీట్లు లేవని పేర్కొంటూ బోర్డులు కూడా పెట్టేశాయి. విద్యాశాఖ ఇప్పటికే ఫీజుల నియంత్రణపై కొన్ని సిఫార్సులను చేసినా, అవి ఆమోదయోగ్యమో, కాదో కూడా చెప్పే సమయం, వ్యవధి పాలకులకు లేకపోవడంతో అవి రికార్డులకే పరిమితం అయ్యాయి. ఇంత వరకూ ఆ ప్రతిపాదనలపై చర్చ కూడా జరగలేదు. కావాలనే కాలయాపన చేస్తున్నారనే విమర్శలు కూడా వినవస్తున్నాయి. ఫీజుల నియంత్రణ పేరిట మరో కమిటీని నియమించారు.
ఆ కమిటీలో భిన్నమైన ఉపాధ్యాయ సంఘాలను సైతం నియమించడంతో ఈ కమిటీ ఎన్ని రోజులు అధ్యయనం చేస్తుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు ముకుతాడు వేస్తామని చెప్పిన ప్రభుత్వం మూడేళ్లు ఇట్టే గడిపేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య దాదాపు 10 లక్షల వరకూ ఉంది. ఈ విద్యార్ధులు అంతా ప్రైవేటు స్కూళ్లు సూచించిన యూనిఫారాలను, పాఠ్య పుస్తకాలను, నోట్ పుస్తకాలను నిర్బంధంగా కొనాల్సిన పరిస్థితి వచ్చింది. వెయ్యి రూపాయిలకు దొరికే పుస్తకాలను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఏడెనిమిది వేలకు విద్యార్థులకు అంటగడుతున్నాయి. ప్రభుత్వ పుస్తకాల పంపిణీ మరో పక్క అడ్డదారిపడుతోంది. చదువులను వ్యాపారంగా మార్చేసిన ప్రైవేటు విద్యాసంస్థలు ప్రశ్నాపత్రాలను లీక్ చేస్తున్నాయి.
ఇటీవల టెన్త్ పేపర్ లీక్ అయిందనే కలకలం చెలరేగింది. అయితే దానిని అధికారగణం మాత్రం కొట్టి పారేసింది. గతంలోనూ ఎమ్సెట్ పేపర్ లీక్‌ను తొలుత కొట్టిపారేసిన అధికారులు తర్వాత లీక్ అయిందంటూ అంగీకరించాల్సి వచ్చింది. ఇంత వరకూ ఎమ్సెట్ లీకేజీ వ్యవహారం కొలిక్కి రానే లేదు. ఎపుడు వస్తుందనేది ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది.