తెలంగాణ

2022కి రైతుల ఆదాయం రెట్టింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: తెలంగాణ రాష్ట్రంలో 2022 సంవత్సరం వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు గల అవకాశాలపై మంగళవారం ఏర్పాటు చేసిన వ్యవసాయ వర్సిటీ మొట్టమొదటి సమన్వయ కమిటీ సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్‌రావు చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా వైస్-్ఛన్సలర్ మాట్లాడుతూ రైతుల ఆదాయం పెంచేందుకు ఏడు వ్యూహాలను అమలు చేయాల్సి ఉందన్నారు.
రాష్ట్రంలో 75 శాతం మంది రైతులు ఐదు ఎకరాలలోగా భూమి ఉన్న వారేనని, వర్షాధారంపైనే వ్యవసాయం ఎక్కువగా ఆధారపడి ఉందని, తరచూ కరవుపరిస్థితి రైతులను ఇక్కట్లకు గురిచేస్తోందని తెలిపారు. అలాగే ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, కంది తదితర పంటల్లో ప్రస్తుతం ఉన్న ఉత్పాదకతను పెంచే అవకాశాలను కూలంకషంగా పరిశీలించాలని, పంటలవారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి రైతులకు చేయూత ఇవ్వాలని, యాంత్రిక సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, భూసారపరీక్షల ద్వారా రైతుల ఖర్చును సగానికి సగం తగ్గించే అంశంపై రైతుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పశువుల పెంపకం, పాడిపరిశ్రమను రైతులు చేపట్టడం వల్ల వ్యవసాయానికి తోడుగా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ డాక్టర్ డి. వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా తెలిపారు. గొర్రెలు, కోళ్ల పెంపకాన్ని కూడా చేపట్టడం వల్ల అదనపు ఆదాయం లభిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందు వల్ల పశుగ్రాసాన్ని పెంచేందుకు అవకాశాలు ఏర్పడ్డాయన్నారు.

చిత్రం..మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ వర్శిటీలో సమావేశమైన సమన్వయ కమిటీ