తెలంగాణ

ద.మ.రైల్వే గ్రీన్ బిల్డింగ్ అభివృద్ధికి ఐజిబిసి సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ)కు అనుంబంధ విభాగమైన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజిబిసి)తో రైల్వే అవగాహన ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని రైల్వే ప్రధాన కార్యాలయం, రైల్వే స్టేషన్లను పచ్చదనంతో, పర్యావరణాన్ని కాపాడేవిధంగా గ్రీన్‌బిల్డింగ్ అభివృద్ధికి గాను ఐజిబిసితో ఒప్పందం దోహదపడుతుందని రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. గురువారం నాడిక్కడ రైల్ నిలయంలో జరిగిన సమావేశంలో ఈ ఒప్పంద వివరాలను జోనల్ జనరల్ మేనేజర్ వెల్లడించారు. రైల్వేలకు గ్రీన్ రేటింగ్ ఇవ్వడంతో పాటు ప్రొడక్షన్ యూనిట్ల వద్ద ఇంధన సామర్థ్య అధ్యయనం కూడా చేపట్టేందుకు రైల్వే శాఖ ఈ ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఎకె గుప్తా, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ అర్జున్ ముందియా తదితరులు పాల్గొన్నారు.