తెలంగాణ

అసెంబ్లీ ముట్టడికి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: ముస్లిం రిజర్వేషన్లకు నిరసనగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు బిజెపి, బజరంగ్‌దళ్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఆదివారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయం నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ట్రాఫిక్ స్తంభించి, ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పలుచోట్ల బిజెపి నాయకులను ముందస్తుగానే అరెస్టు చేశారు. అంబర్‌పేట, కాచిగూడ, మలక్‌పేట, తుకారాంగేట్, గోషామహల్‌లో బిజెపి కార్యకర్తలను ఆదివారం ఉదయం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా పలువురు నాయకులను అరెస్టు చేసినట్టు నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. మతపరమైన రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకిస్తున్నామని, ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, ఇది సుప్రీంకోర్టులో నిలువదని బిజెపి, బజరంగ్‌దళ్ నాయకులు అన్నారు.