తెలంగాణ

బిసి రిజర్వేషన్లను 52శాతానికి పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: బిసి రిజర్వేషన్లను 25 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యే, బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం అసెంబ్లీ సమావేశంలో రిజర్వేషన్ల బిల్లుపై ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బిసి రిజర్వేషన్లు పెంచకుండా ఇతర రిజర్వేషన్లను పెంచడం పట్ల బిసిల్లోని 98 ఉప కులాల వారు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. చట్ట సభల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఇదివరకే అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఈ విషయమై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలని కోరారు. అంతకు ముందు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ మాట్లాడుతూ ఇంత వరకు ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారని కాంగ్రెస్‌ను విమర్శించారు. ముస్లింల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన అభినందించారు. సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ బిసిలకు 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. వాల్మీకి, బోయ, కోయ, లంబాడీల మధ్య ఘర్షణకు తావు లేకుండా రిజర్వేషన్లు ఉండాలని ఆయన సూచించారు.