తెలంగాణ

బిజెపి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికి చంపుతామంటూ ఫోన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత, అంబర్‌పేట ఎమ్మెల్యే జి కిషన్‌రెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈమేరకు ఆయన మంగళవారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను చంపుతానంటూ గుర్తు తెలియని కొందరు ఇంటర్నెట్ ద్వారా కాల్స్ చేస్తున్నారని ఆయన సిసిఎస్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై దర్యాప్తు జరుపుతున్నామని డిసిపి అవినాష్ మహంతి తెలిపారు. కిషన్‌రెడ్డిని చంపుతామని ఇంటర్నెట్ ద్వారా కాల్స్ వచ్చాయని గుర్తించినట్టు ఆయన చెప్పారు. అయితే కాల్స్ ఎక్కడి నుం వచ్చాయో..దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే బెదిరింపులకు పాల్పడిన వారిని పట్టుకుంటామని, కేసును పరిష్కరిస్తామని డిసిపి అవినాష్ మహంతి వివరించారు.