తెలంగాణ

ప్లీనరీకి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: హైదరాబాద్ నగర శివారులోని కొంపల్లిలో ఈ నెల 21న నిర్వహించనున్న టిఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తి అయినట్టు ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కె తారకరామారావు తెలిపారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ప్లీనరీ ప్రాంగణాన్ని మంత్రి కెటిఆర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, ప్లీనరీకి 15 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్లీనరీ ప్రారంభం అవుతుందని, పార్టీ పతకాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులు ఆర్పించాక పార్టీ అధ్యక్షున్ని ఎన్నికల నిర్వహణాధికారి, హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి ప్రకటిస్తారన్నారు. పార్టీ అధ్యక్షుని స్వాగతోపన్యాసం అనంతరం తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. ఒంటి గంటకు భోజన విరామం ఉంటుందని, ఆ తర్వాత రెండు గంటలకు ప్లీనరీ రెండవ సెషన్ ప్రారంభం అవుతుందని తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ ప్రసంగంతో ప్లీనరీ ముగుస్తుందన్నారు. ప్లీనరీ ప్రాంగణంలో ప్రజాప్రతినిధులు, కళాకారులకు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులు అందరికీ గుర్తింపు కార్డులు జారీ కోసం ప్రతీ జిల్లాకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్లీనరీకి వచ్చే ప్రజాప్రతినిధులు, మహిళలు, విఐపిలు, మీడియాకు విడివిడిగా ప్రత్యేకంగా ఆరు భోజనశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ప్లీనరీకి వచ్చే ప్రతినిధుల కోసం 31 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ సౌకర్యం కల్పించామని, అలాగే ప్లీనరీ వల్ల నగర ప్రజానీకానికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఔటర్ రింగ్ రోడ్ ద్వారానే వాహనాలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో హోర్డింగ్‌లు, ప్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటుపై నిషేధం ఉండటంతో పార్టీ శ్రేణులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, జిహెచ్‌ఎంసి పరిధిలోకిరాని చోట్ల వీటిని ఏర్పాటు చేసుకోవచ్చని మంత్రి సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, పాలనాపరంగా ముఖ్యమంత్రి కెసిఆర్ నంబర్ వన్‌గా నిలిచారని మంత్రి అన్నారు. మిగతా రాష్ట్రాలు ఆశ్చర్యపోయేలా 21 శాతం వృద్ధిరేటుతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. మిషన్ కాకతీయ పథకానికి అంతర్జాతీయంగా ప్రశంసలు లభించాయన్నారు. ఇప్పటికే 8 రాష్ట్రాలు ఈ పథకాన్ని పరిశీలించి వెళ్లయన్నారు. అలాగే నూతన పారిశ్రామిక విధానానికి జాతీయ, అంతర్జాతీయంగా మన్ననలు లభించాయన్నారు.

చిత్రం... తెరాస నేతలతో కలిసి ప్లీనరీ ఏర్పాట్లను బుధవారం పరిశీలిస్తున్న మంత్రి కెటిఆర్