తెలంగాణ

ధాన్యం సేకరణపై ప్రతి రోజూ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: ధాన్యం సేకరణపై ప్రతి రోజూ సమీక్షించాలని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. గురువారం కొందరు కలెక్టర్లతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ధాన్యం క్రయ విక్రయాల్లో తలెత్తుతున్న ఇబ్బందులపై చర్చించారు. వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మార్గదర్శకాలను ఇంతకు ముందే వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించినట్టు చెప్పారు. మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని ప్రతి రోజు జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ సమీక్షించాలని చెప్పారు. ఎలాంటి జాప్యం లేకుండానే వెంటనే ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ధాన్యం కనీస మద్దతు కల్పించాలని అన్నారు. తేమ శాతం 17లోపు ఉండాలని రైతులలో విస్తృత ప్రచారం చేయాలని కోరారు. రెవెన్యూ వ్యవసాయ శాఖ, ఐకెపి శాఖల ద్వారా ప్రచారం చేయాలని, రైతులకు అవగాహన కల్పించాలని మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదేశించారు. సరిహద్దు జిల్లాల్లో పొరుగు రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేయవచ్చునని చెప్పారు.
అయితే రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులను పటిష్టం చేయాలని చెప్పారు. వర్ష సూచన ఉన్న సందర్భాల్లో వ్యవసాయ మార్కెట్‌లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రైతులకు కనీస మద్దతు ధర వచ్చేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల తర్వాత చెల్లింపులు 48గంటల లోనే జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల సమస్యలు, క్రయ విక్రయాల్లో తలెత్తే ఇతర పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. ఏ రోజుకారోజు మార్కెట్ నుంచి ధాన్యం మిల్లులకు, గోదాములకు తరలించాలని మంత్రి సూచించారు.