తెలంగాణ

మారథాన్‌కు తోడ్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: స్వచ్ఛ తెలంగాణ, క్రీడల అభివృద్ధి కావాలనే నినాదంతో ఈ నెల 27 నుంచి తలపెట్టిన 2000కె రన్ (2000 కిలోమీటర్ల పరుగు) మారథాన్‌కు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని సాహస క్రీడాకారిణి కుమారి కొర నిఖిత ప్రభుత్వానికి, దాతలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం దేశోద్ధారక భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డి.సుధాకర్, కార్యదర్శి రేఖ రాణి, తల్లి దీపతో కలిసి నిఖిత మాట్లాడారు. ఈ నెల 27 నుంచి తన పరుగును మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు ఆమె వెల్లడించారు. తొలుత గన్‌పార్కు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి తన పరుగును ప్రారంభించనున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో సాహసోపేతమైన క్రీడలు, ముఖ్యంగా వాటర్ రాఫ్లింగ్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలన్నది తన ఆశయమని నిఖిత పేర్కొంది.