తెలంగాణ

శతాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలను ప్రపంచం అబ్బురపడేలా నిర్వహిస్తామని వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం తెలిపారు. శుక్రవారం నాడు శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించిన అనంతరం ఉత్సవాల కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లుతో కలిసి పాత్రికేయులతో మాట్లాడారు. 26న వర్శిటీ ‘ఎ’ గ్రౌండ్‌లో ఉదయం 10.30 నుండి సాంస్కృతిక కార్యక్రమాలతో శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం అవుతాయని అన్నారు. ఒయు డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని, మధ్యాహ్నం 12.30 నుండి 1.30 గంటల వరకూ జరిగే ప్రధానకార్యక్రమానికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అధ్యక్షత వహిస్తారని, సభకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, బండారు దత్తాత్రేయ, కడియం శ్రీహరి, డాక్టర్ కె కేశవరావు, బొంతు రామమోహన్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని అన్నారు.
రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుండి ఐదు వరకూ జరుగుతుందని అందులో ‘తెలంగాణ-దేశ పునర్నిర్మాణంలో ఉస్మానియా యూనివర్శిటీ పాత్ర’ పేరుతో సెమినార్ జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా వస్తారని, ఎంపి కె కేశవరావు అధ్యక్షత వహిస్తారని అన్నారు. ఇందులో ఆరుగురు ప్రముఖులు ఆరు అంశాలపై ప్రసంగిస్తారని చెప్పారు. సాయంత్రం 6.30 నుండి 9.30 గంటల వరకూ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు.
27వ తేదీన మూడు సెషన్స్ జరుగుతాయని, సెషన్-1లో నోబెల్ గ్రహీత అబ్దెసత్తార్ బెన్ వౌసా కీలక ప్రసంగం చేస్తారని, రెండో ప్రసంగం ఇస్రో చైర్మన్ ఎ ఎస్ కిరణ్ కుమార్ చేస్తారని, ఇక రెండో సెషన్‌లో మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు హాజరవుతారని వివరించారు. ఈ కార్యక్రమం ఎ గ్రౌండ్‌లో జరుగుతుందని, తొలి సెషన్ మాత్రం టాగోర్ ఆడిటోరియంలో జరుగుతుందని చెప్పారు.
ఇక మూడో సెషన్‌లో అఖిల భారత వైస్ చాన్సలర్ల సదస్సు జరుగుతుందని, దీనికి కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. సాయంత్రం 6.30 నుండి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. 28వ తేదీన తొలి సెషన్‌లో అఖిల భారత విసిల సదస్సు సాంకేతిక అంశాలపై ఐఐసిటి ఆడిటోరియంలో కొనసాగుతుందని, ఉస్మానియా దిశ అంశంపై చర్చ జరుగుతుందని, ఈకార్యక్రమానికి డాక్టర్ కె కేశవరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని, సాయంత్రం 6 తర్వాత ముగింపు కార్యక్రమం ఆర్ట్సు కాలేజీలో జరుగుతుందని పేర్కొన్నారు.