తెలంగాణ

ఎస్టీ మహిళకు అన్యాయంపై వారంలోగా నివేదిక సమర్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో మహిళా రిజర్వేషన్ విధానాన్ని సరిగా అమలు చేయలేదని ఎస్టీ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ విషయమై తమ అభిప్రాయాన్ని తెలియచేయాలని హైకోర్టు తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశించింది.
హైదరాబాద్ నగరానికి చెందిన కె కవిత అనే మహిళ ఈ పిటిషన్ దాఖలు చేశారు. తనకు 102 మార్కులు వచ్చినా, ఎస్టీ కోటా కింద లేదా పోలీసు సిబ్బంది పిల్లల కోటా కింద తన అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఆమె పేర్కొన్నారు. తనకంటే జనరల్ కోటాలో తక్కువ మార్కులు తెచ్చుకున్న వారికి కూడా ఉద్యోగం వచ్చిందన్నారు. స్టయిపెండరీ కేడెట్ ట్రైనీ పోస్టుకు తనకు ఉన్న రిజర్వేషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె కోరారు. ఈ కేసులో పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు అఫిడవిట్ దాఖలు చేసేందుకు వారం రోజుల గడువును హైకోర్టు ఇచ్చింది.