తెలంగాణ

31 జిల్లాలతో ప్రజలకు చేరువైన పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలను 31 జిల్లాలుగా చేయడం వల్ల పరిపాలనను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్ళినట్లు అయ్యిందని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) తాజా నివేదికలో స్పష్టం చేసింది. శుక్రవారం బేగంపేట్‌లోని ‘సెస్’ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ చాన్సలర్ ప్రొఫెసర్ వైకె అలఘ్ ఈ నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ చిన్న జిల్లాల వల్ల అసమతుల్యత తొలగిపోతుందని అన్నారు. ఒక గ్లాసులో సగం నీరు ఉన్నట్లయితే, చూసే వారిని బట్టి ఉంటుందని ఆయన చెప్పారు. సగం గ్లాసు ఖాళీగా ఉందని కొందరు అంటే, పాజిటివ్‌గా ఆలోచించే వారు గ్లాసులో సగం నీరు ఉందని చెబుతారని ఆయన తెలిపారు. అలాగే జిల్లాల అభివృద్ధి విషయంలోనూ అసమతుల్యత ఉంటుందని, అయితే చిన్న జిల్లాలు చేయడం వల్ల పరిపాలన ప్రజలకు చేరువ అవుతుందన్నారు. అయినా ‘తెలంగాణ ల్యాండ్ లార్డ్ స్టేట్’ అని అభివర్ణించారు. రాష్ట్ర ప్రగతి, ప్రజల అభివృద్ధి ముఖ్యమని అన్నారు. వ్యవసాయాభివృద్ధి ఇంకా జరగాల్సి ఉందని ఆయన తెలిపారు. గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించాలని, ఇంకా విద్య, వైద్య రంగాలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా బాలికలు బడి మానేయకుండా చూడాలని ప్రొఫెసర్ వైకె అలఘ్ అన్నారు.
ఇతర రాష్ట్రాలకు ఆదర్శం
ఇనిస్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ప్రొఫెసర్ ఎస్‌ఆర్ హషీం ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణలోని 10 జిల్లాలను 31 జిల్లాలుగా చేయడం వల్ల పాలనపై మరింత దృష్టి పెరుగుతుందని, తద్వారా పరిపాలన ప్రజలకు చేరువ అవుతుందని, దీంతో ప్రజల అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని ఆయన చెప్పారు. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.రాధాకృష్ణ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ప్రొఫెసర్ గలబ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. జిల్లాల మధ్య, గ్రామీణ, పట్టణాల మధ్య అసమతుల్యత తొలగించాలని, నిధుల కేటాయింపుల్లోనూ సమతుల్యత పాటించాలని అన్నారు. విద్య, వైద్య రంగాలపై దృష్టి సారించాలని ఆయన తెలిపారు. 21 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ పని తీరు బాగుందని ఆయన చెప్పారు.