తెలంగాణ

నిజాంసుగర్స్ కోసం జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్ రూరల్, మార్చి 26: నిజాంసుగర్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం బోధన్ మండలం సాలూరా గ్రామం వద్ద జాతీయ రహదారి పై అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు, కార్మికులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. యాజమాన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించి రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. తెరాస అధికారంలోనికి వచ్చిన వెంటనే నిజాంసుగర్స్ కర్మాగాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమంటూ ఎన్నికలలో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి నేడు కర్మాగారం గురించి పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. రైతుల రాస్తారోకో వలన ప్రధాన రహదారిపై ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న బోధన్ ఎస్‌ఐ గంగాధర్‌రావు అదనపు బలగాలతో అక్కడికి చేరుకుని రైతులను, నాయకులను సముదాయించారు. కానీ వారు పట్టించుకోకుండా యథావిధంగా ఆందోళన కొనసాగించడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ రాస్తారోకోలో నిజాంసుగర్స్ రక్షణ కమిటీ కన్వీనర్ రాఘవులు, జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, సిపిఐఎంఎల్ న్యూ డెమొక్రసీ నాయకులు మల్లేష్, వరదయ్య, గుమ్ముల గంగాధర్, తెలుగుదేశం పార్టీ నాయకులు మావంది గంగారెడ్డి, కెపి.క్రిష్ణారెడ్డి, సిపిఎం నాయకులు గంగాధర్ అప్పా, శంకర్‌గౌడ్, సాయిలు, సిపిఐ నాయకులు శేఖ్‌బాబు, హన్మంత్‌రావ్, కార్మిక జేఏసి నాయకులు ఈరవేణి సత్యనారాయణ, కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులు అల్లె రమేష్, శీల శంకర్, మందర్న రవి, సాయిరెడ్డి, గాండ్ల రాజేశ్వర్, రైతులు, కార్మికులు పాల్గొన్నారు.