తెలంగాణ

తెరాస అధ్యక్షునిగా కెసిఆర్ ఏకగ్రీవ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షునిగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎనిమిదవ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ల కోసారి జరిగే ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ప్లీనరీ సభలోనే అధ్యక్షుని ఎన్నిక ప్రకటన చేస్తారు. కొత్త అధ్యక్షుని అధ్యక్షతన ప్లీనరీ జరుగుతుంది. తొలుత ప్లీనరీలో అధ్యక్షుని ఎన్నిక ఉంటుందని తెలిపినా తర్వాత మార్చారు. దివ్యమైన ముహూర్తం ఉండడం వల్ల 9.55కు తెలంగాణ భవన్‌లో కెసిఆర్ ఏకగ్రీవంగా తెరాస అధ్యక్షునిగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు ప్రకటించారు. అనంతరం కెసిఆర్ కొంపల్లిలోని పార్టీ ప్లీనరీకి హాజరయ్యారు. కెసిఆర్ వేదికపైకి రాగానే పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కేకలు వేశారు.
తనపై విశ్వాసం ఉంచి అధ్యక్షునిగా ఎన్నుకున్న పార్టీనాయకులకు కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. 2001లో తెలంగాణ ఆగమైపోయిన సమయంలో జై తెలంగాణ నినాదంతో టిఆర్‌ఎస్ పార్టీ పుట్టిందని అన్నారు. గులాబీ జెండా ఎగిరినప్పటి నుంచీ అన్ని అనుమానాలే అని, ఈ పార్టీ నిలబడేది కాదని అన్నారని, 14ఏళ్ల పోరాటంతో తెలంగాణను సాధించుకున్నామని అన్నారు. భయంకరమైన కరవు, ఎండిపోయిన బావులు, రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, గుడుంబా రాజ్యం వంటి పరిస్థితుల్లో తెరాస ఆవిర్భవించిందని గుర్తు చేశారు. తెలంగాణ వస్తే కరెంటు కష్టాలు తప్పవని గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఒకరు కట్టెపట్టుకుని చూపించారని, అయతే ఇప్పుడు 9,350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగలుగుతున్నామని, ఉమ్మడి రాష్ట్రంలో కన్నా ఎక్కువ విద్యుత్‌ను అందించగలుగుతున్నామని కెసిఆర్ స్పష్టం చేశారు.

చిత్రం.. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన ముఖ్యమంత్రి కెసిఆర్