తెలంగాణ

భారీ బహిరంగ సభకు సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా ముందస్తుగానే ప్రత్యర్థులపై పైచేయి సాధించే వ్యూహాన్ని తెరాస అమలు చేస్తోంది. ఉద్యమ సమయంలో తెరాస వరంగల్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభ తెలంగాణ ఉద్యమానికి ఉత్తేజాన్నిచ్చింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులకు ఉత్తేజాన్ని కలిగించేందుకు వరంగల్‌లో భారీ స్థాయిలో భారీ బహిరంగ నిర్వహించేందుకు తెరాస ఏర్పాట్లు చేస్తోంది. రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని తెరాస ప్రభుత్వం పథకాలకు రూపకల్పన చేస్తోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచడంతో పాటు గ్రామాలు తెరాసకు బలమైన ఓటు బ్యాంకుగా మారేవిధంగా ఈ పథకాలకు రూపకల్పన జరుగుతోంది. పంటలకు కావలసిన పెట్టుబడి ప్రభుత్వమే సమకూర్చడం, నేరుగా రైతుల ఖాతాల్లో జమచేయడం పార్టీకి ఎంతో మేలు చేకూరుస్తుందని తెరాస నాయకులు అంచనా వేస్తున్నారు. ఏడాదిలో రెండు పంటలకూ ఎకరానికి నాలుగువేల రూపాయల చొప్పున అందించేందుకు వారు ప్రణాళిక సిద్ధం చేశారు. గ్రామ స్థాయిలో రైతు సంఘాలను ఏర్పాటు చేసి ఈ సంఘాల ద్వారా రైతులను ఎంపిక చేస్తారు. ఇది రాజకీయంగా గ్రామాల్లో తెరాస బలపడేందుకు ఉపయోగపడుతుంది. సంక్షేమ పథకాలు సైతం గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలపడేందుకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. గెలుపునకు అవసరం అయినంత మందికి ఆసరా పెన్షన్లు ఉన్నాయని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. తెలంగాణ ఆవిర్భవించి, తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయే వర్గాలకు మేలు జరుగుతుందో ఆ వర్గాల ప్రాతినిధ్యం కనిపించే విధంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. బహిరంగ సభకు ప్రగతి నివేదిక అని పేరు పెట్టారు. గత రెండున్నర ఏళ్లలో తెరాస సర్కారు సాధించిన ప్రగతితో పాటు ఇంకా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను ఈ బహిరంగ సభలో వివరిస్తారు. బహిరంగ సభకు పదివేల ట్రాక్టర్లలో రైతులు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. 27న బహిరంగ సభ జరుగుతుంది.
తెలంగాణలో రైతే రాజు అని తెరాస ప్లీనరీలో ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. బహిరంగ సభకు నిధుల సమీకరణ కోసం గులాబీ కూలీ పేరుతో మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు వారం రోజుల పాటు కూలీ చేసి విరాళాలు సేకరించారు. ప్రధానంగా వరంగల్ జిల్లా నుంచే ఎక్కువ జన సమీకరణ చేస్తారు. ఈ సభలో కెసిఆర్ గత రెండున్నర ఏళ్లలో సాధించిన అభివృద్ధితో పాటు రాజకీయ అంశాలపై మాట్లాడతారని తెరాస నాయకులు తెలిపారు.