తెలంగాణ

అన్ని మున్సిపాలిటీలకు మాస్టర్ ప్లాన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు, వౌలిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా తప్పనిసరిగా మాస్టర్ ప్లాన్ (బృహత్తర ప్రణాళిక)ను ఖరారు చేసేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ విధి విధానాలను రూపొందించింది. వచ్చే ఏడాది జూన్ 2వ తేదీకి తెలంగాణ రాష్ట్రం అవతరించి నాలుగేళ్లు అవుతుంది. ప్రతి మున్సిపాలిటీ తప్పనిసరిగా మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సహకరిస్తుంది. ఈ ప్రణాళికలను తయారు చేసేందుకు కనె్సల్టెంట్లను కూడా నియమించనున్నారు. మాస్టర్ ప్లాన్ వల్ల నగరాభివృద్ధిని వేగవంతం చేయడం, అక్రమ కట్టడాలను నిరోధించడం వీలవుతుందని అధికారులు తెలిపారు. దేశం మొత్తం మీద ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌లో అగ్ర స్ధానంలో నిలిచిన తెలంగాణలో మున్సిపాలిటీలు మాస్టర్ ప్లాన్‌ను రూపొందించుకుంటే ప్రపంచ బ్యాంకుతో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధుల విడుదల సులభమవుతుంది. డిపార్టుమెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ పాలసీ సంస్ధ ఈ ప్రణాళికలను రూపొందించాలని మున్సిపల్ శాఖను కోరింది. ఈ మాస్టర్ ప్లాన్స్‌ను సిద్ధం చేసిన వెంటనే డిటిసిపి వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
రాష్ట్రంలో 73 మున్సిపాలటీల్లో 14 మున్సిపాలిటీలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నాయి. 32 మున్సిపాలిటీలకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్స్‌ను తెలంగాణ మున్సిపల్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం కింద తయారు చేశారు. మరో 27 మున్సిపాలిటీల మాస్టర్ ప్రణాళికలను వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్స్ తయారు చేసేందుకు కొత్త ఫార్ములాను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా (హైదరాబాద్, వరంగల్ రీజియన్‌లుగా) విభజించి, వీటి పరిధిలోకి ఆయా మున్సిపాలిటీలను చేర్చాలని ప్రతిపాదించారు. వరంగల్ రీజియన్‌లో ఆదిలాబాద్, భైంసా, జగిత్యాల, జనగాం, కాగజ్‌నగర్, కోరుట్ల, కొత్తగూడెం, మంచిర్యాల, మందమర్రి, మెట్‌పల్లి, నిర్మల్, పాల్వంచచ, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, రామగుండం కార్పొరేషన్లను చేర్చుతారు. వరంగల్ నుంచి ఈ మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్స్ రూపకల్పనను పర్యవేక్షిస్తారు. అలాగే హైదరాబాద్ రీజియన్‌లో బోధన్, గద్వాల్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, మిర్యాలగూడ, నల్లగొండ, నారాయణ్‌పేట్, సదాశివపేట, సిద్ధిపేట, సూర్యాపేట, తాండూరు, వికారాబాద్, వనపర్తి, జహీరాబాద్, నిజామాబాద్ నగర పాలక సంస్ధలను చేర్చారు.