తెలంగాణ

‘్భగీరథ’కు రెండోసారి హడ్కో అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథకు మరోసారి జాతీయ అవార్డు లభించింది. వౌలిక వసతుల కల్పనలో మిషన్ భగీరథ వినూత్నమైన పథకమని ప్రశంసించిన హడ్కో ఈ పథకానికి రెండోసారి అవార్డు ప్రకటించింది. తెలంగాణలో కోట్లాది మంది ప్రజలకు మంచి నీటిని అందించాలన్న సంకల్పంతో సాగుతున్న మిషన్ భగీరథలో తాము భాగస్వామిగా కావడాన్ని గర్వంగా భావిస్తున్నట్టు హడ్కో పేర్కొంది. ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నామని హడ్కో స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో ఈనెల 25న జరిగే హడ్కో 47వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా తెలంగాణ ప్రభుత్వానికి ఈ అవార్డును అంద జేయనున్నట్లు హడ్కో తెలిపింది.