తెలంగాణ

‘మిషన్ భగీరథ’కు మిగిలింది 7 నెలలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: మరో ఏడు నెలలు గడిస్తే రాష్ట్రంలో 24వేల 248 గ్రామాల్లోని లక్షలాది కుటుంబాలకు ఇంటింటికి మంచినీటిని అందించే మిషన్ భగీరథ పథకం పూర్తి కావాలి. 2019 ఎన్నికల నాటికి ఇంటింటికి మంచినీటిని అందించక పోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేది లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ పలు సభల్లో ప్రకటించారు. అయితే 2017 డిసెంబర్ నాటికే ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా డిజైన్ చేశారు. డిసెంబర్ నాటికి 24,248 గ్రామాలు, 65 పట్టణాల్లో ఇంటింటికి మంచినీటిని ఇచ్చి చూపిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అనుకున్నట్టుగా పనులు సాగినా కూలీల కొరత కొన్ని ప్రాంతాల్లో పనులకు ఆటంకంగా మారింది. స్థానికులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో స్థానిక కాంట్రాక్టర్లకే అవకాశం ఇచ్చామని, కానీ పనుల్లో ఆలస్యాన్ని నివారించేందుకు ఇతర రాష్ట్రాల కాంట్రాక్టర్లకు కూడా అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో అధికారులు కాంట్రాక్టర్ల కోసం ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారు.
మిషన్ భగీరథ కోసం కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తీసుకోనున్నారు. ఆయా రివర్ బేసిన్లలో 16 ప్రాంతాల్లో 19 ఇన్‌టెక్ వెల్స్ నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటితో పాటు కొత్తగా కడుతున్న 50 వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణం జూన్ నాటికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు లక్షా 69వేల 700 కిలో మీటర్ల పొడవైన పైప్‌లైన్ వేస్తున్నారు. ఈ పైపులను పేర్చుకుంటూ పోతే భూమిని మూడుసార్లు చుట్టి రావచ్చు. ఓ ప్రాజెక్టు కోసం ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత భారీ పైపులైన్లు వేయలేదు. 4429 కిలో మీటర్లు ప్రధాన లైన్ కాగా, గ్రామాలకు నీటిని సరఫరా చేసేందుకు మరో 46వేల 931 కిలో మీటర్ల పొడవైన పైప్‌లైన్ వేస్తారు.
పైప్‌లైన్లతో పాటు ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ వేసి ప్రతి ఇంటికి ఇంటర్‌నెట్ కనెక్షన్ ఇవ్వబోతున్నారు. దీని వల్ల వంద శాతం డిజిటలైజేషన్ అయిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది. 43వేల కోట్ల రూపాయల వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టుకు 80 శాతం రుణంగా, మరో 20 శాతం ప్రభుత్వం నుంచి మార్జిన్ మనీగా అందుతుంది. మిషన్ భగీరథ అమలు తరువాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మార్పులు, ఆరోగ్యం, నీళ్ల కోసం ఆడపిల్లలు బడులు మానేసే పరిస్థితి ఎంత వరకు మారింది తదితర అంశాలపై అధ్యయనం చేయనున్నారు.