తెలంగాణ

ఉద్యోగాల పేరుతో మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకులను మోసం చేసి దాదాపు కోటి రూపాయలు వసూలు చేసిన ఏడుగురు మోసగాళ్లను హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ప్రభుత్వ అధికారుల పేరుతో ఉన్న 52 రబ్బరు స్టాంపులు, 27 నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు, నకిలీ విచారణ నివేదిక, కలర్ జిరాక్స్ మిషన్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
జిహెచ్‌ఎంసి, రెవెన్యూ, జూనియర్ అసిస్టెంట్, హెల్త్, నీటి పారుదల తదితర వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజలను కొంతకాలంగా వీరు మోసం చేస్తున్నారు. ఏడుగురు నిందితుల్లో అస్కా వినయ్‌కుమార్, ఎం.సురేష్‌కుమార్, మాధవరావు, చీరాల సుధీర్‌కుమార్, చల్లా శ్రీ్ధర్ రెడ్డి, బి.కృష్ణమూర్తి, సయ్యద్ నిజాం ఉన్నారు. కాగా వీరిలో వినయ్‌కుమార్ అనే వ్యక్తి గతంలో జిహెచ్‌ఎంసి సర్కిల్-9లో బిల్ కలెక్టర్‌గా పనిచేసి సస్పెండ్ అయ్యాడు. తనకున్న పరిచయాలతో అతను ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేసినట్టు టాస్క్ఫోర్స్ డిసిపి లింబారెడ్డి వివరించారు. వీరు దాదాపు 40 మందిని నుంచి రూ. కోటి రూపాయల మేరకు వసూలు చేశారని డిసిపి వెల్లడించారు.