తెలంగాణ

మనకు తిరుగులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే ఏడాది నుంచే కట్టుదిట్టంగా రైతు సాయం అమలు
వచ్చే బడ్జెట్‌లో 7.5 వేల కోట్లు 11మంది సిఎంలు వివరాలడిగారు
పరిశీలనకు బారులుతీరిన రాష్ట్రాలు రైతు హితలో కెసిఆర్ వెల్లడి

హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణను 2019కల్లా దేశంలోనే ఆదర్శవంత రాష్ట్రంగా మారుస్తామని సిఎం కె చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వ విధానాన్ని గ్రామ, మండలస్థాయి అధికారులకు వివరించేందుకు హైదరాబాద్ హైటెక్స్ హాలులో ‘రైతుహిత’ పేరిట మంగళవారం ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడారు. వ్యవసాయం రైతుల ‘జీవన విధానం’ అన్నారు. గతంలో యువ రైతులకు పిల్లను ఇచ్చేందుకు తల్లిదండ్రులు వెనుకాడేవారని, ఇప్పుడు మారిన పరిస్థితిలో రైతులకే తమ కూతుళ్లను ఇచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచనకు తల్లిదండ్రులు వస్తున్నారన్నారు. గత పాలకుల విధాన నిర్ణయాల వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవారని, ఆత్మహత్యల నివారణకు తాము అనేక పథకాలు చేపట్టామన్నారు. గతంలో ఎరువులను పోలీస్ స్టేషన్లలో విక్రయించేవారని, వాటికోసం రైతులు చెప్పులను క్యూలో ఉంచి ఇతర పనులు చేసుకునే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. తెలంగాణలో పంటలు వేసే రైతులకు ఎకరాకు 4 వేల రూపాయలు ఇచ్చే విధానం 2018 వానాకాలం పంటలతో ప్రారంభమవుతుందని, ఈ డబ్బు విత్తనాలు, ఎరువులు తదితరాలను కొనుగోలు చేసేందుకు రైతులకు ఉపయోగపడుతుందన్నారు. వానాకాలానికి సంబంధించిన పంటలకు ఇచ్చే డబ్బు మే15 లోగా, యాసంగికి ఇచ్చే డబ్బు అక్టోబర్ 15లోగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో వేస్తామన్నారు. వచ్చే ఏడాది బడ్జెట్‌లో ఈ పథకం కోసం ఏడు నుంచి 7.5వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అంటే వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన ‘మహాయజ్ఞం’ వచ్చే ఏడు ప్రారంభం అవుతుందన్నారు. భూసార పరీక్షలు పూర్తికావాలని, పంటల కాలనీలు ఏర్పాటు కావాలని, కోటి ఎకరాలకు సాగు నీరు అందాలన్నదే తన ఉద్దేశమని కెసిఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి లభించే ఆదాయం ఏటా పదిహేను నుంచి పదహారు వేల కోట్ల రూపాయలు పెరుగుతూ వస్తోందని, ఈ నిధుల నుండే రైతులకు చేయూతనివ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఎకరాకు నాలుగు వేల రూపాయల పథకాన్ని సమర్థతగా ఉపయోగించాలని, దళారుల బెడదలేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పథకం గురించి ప్రధాని నరేంద్రమోదీతో కూడా చర్చించానని గుర్తు చేశారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 11మంది సిఎంలు తనను కలిసి అభినందించారని, ఈ పథకం వివరాలు కావాలని అడిగారన్నారు.
వ్యవసాయ రంగంలో చేపట్టిన వినూత్న పథకాలు ప్రజలకు చేరేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులు (ఎఇఓ) నడుం బిగించాలని, ఒక్కొక్కరు ఒక కెసిఆర్ కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణను పచ్చని పొలాలతో తులతూగే హరిత తెలంగాణగా మార్చాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనలు రైతులకు చేరాలని, పంటల ఉత్పాదకత పెంచేలా పరిశోధనలు ఉండాలని సూచించారు.
జూన్ 10వరకు నివేదికలు
రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామంలోని భూముల వివరాలు ఈ ఏడాది జూన్ 10 నాటికి ప్రభుత్వానికి అందించాలని సిఎం కెసిఆర్ వ్యవసాయ అధికారులకు, మరీ ముఖ్యంగా ఏఇఓలను ఆదేశించారు. ఏ సర్వే నెంబర్‌లో ఎంత భూమి ఉంది, ఎవరు సాగు చేస్తున్నారు, ఏ పంటల వేస్తున్నారు, సేద్యం కాకుండా ఇతర పనులకు ఎన్ని ఎకరాలు ఉపయోగపడుతున్నాయి తదితర వివరాలను ఏఇఓలు సేకరించి ప్రభుత్వానికి పంపించాలని సూచించారు.
రైతు సంఘాలు, సమాఖ్యలు
ప్రతి గ్రామంలో రైతులతో రైతు సంఘాలను ఏర్పాటు చేయాలని, ఈ సంఘం అధ్యక్ష, కార్యదర్శులతో మండల రైతు సమాఖ్యలను ఏర్పాటు చేయాలని సిఎం పిలుపు ఇచ్చారు. మండల సమాఖ్యల అధ్యక్ష కార్యదర్శులు జిల్లా రైతు సమాఖ్యలను, వారు రాష్ట్ర రైతు సమాఖ్యను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్టర్రైతు సమాఖ్య అధ్యక్షుడు సిఎం తరహాలో శక్తివంతమై ఉంటాడన్నారు. రాష్ట్ర రైతు సమాఖ్యకు 500 కోట్ల నిధి సమకూరుస్తామని, ఈ నిధి మార్కెట్ ఇంటర్‌వెన్షన్ ఫండ్‌గా ఉపయోగపడుతుందన్నారు. ఏ రైతు కూడా తాను పండించిన పంటలను తక్కువ ధరకు విక్రయించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. రైతు సంఘాలు, సమాఖ్యలు తరచూ సమావేశమై సమస్యలపై చర్చించి, పరిష్కార మార్గాలు చూపించాలని సూచించారు. సమావేశంలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ కార్యదర్శి సి పార్థసారథి తదితరులు మాట్లాడారు.

చిత్రం... రైతుహిత సదస్సులో భవిష్యత్ కార్యాచరణపై వ్యవసాయ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు