తెలంగాణ

యుద్ధ వ్యూహంలో కొత్తకోణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్న బాణం బాంబులు.. తాజాగా మహిళా మావోలు దాడి చేసిన వారిలో ఎక్కువ మంది మహిళలే

భద్రాచలం టౌన్, ఏప్రిల్ 25: మావోయిస్టులు ఇటీవల కాలంలో ఎప్పటికప్పుడు తమ యుద్ధ వ్యూహాన్ని మారుస్తున్నట్లు తాజా దాడులు, వ్యూహాలను చూస్తే తేటతెల్లమవుతోంది. అత్యాధునిక ఆయుధాలతో మావోయిస్టులను మట్టుబట్టేందుకు గ్రీన్‌హంట్ పేరిట ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సాగిస్తున్న వేట నేపథ్యంలో ఇప్పుడు మావోయిస్టులు కూడా సరికొత్త ఎత్తుగడలతో ప్రతి దాడులకు దిగుతున్నారు. బాణాలకు శక్తివంతమైన బాంబులు అమర్చి నూతన యుద్ధ పంథాతో చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా బెజ్జి పోలీసులను మార్చి 11వ తేదీన మావోలు బోల్తా కొట్టించారు. వీరి దూకుడుతో పోలీసులు బెంబేలెత్తారు. భూంకాల్ మిలీషియాతో సరికొత్త యుద్ధానికి తెరలేపారు. రాబోయే రోజుల్లో తమ రణరీతి ఎలా ఉంటుందో పోలీసులకు రుచి చూపించారు.
తాజాగా సోమవారం సుక్మా జిల్లా బుర్కాపాల్ వద్ద 25 మంది జవాన్లను మావోయిస్టులు మట్టుబెట్టిన సంగతి విదితమే. ఈ దాడిలో కూడా మావోయిస్టుల సరికొత్త పంథా వెలుగుచూసింది. ఈ ఆపరేషన్‌లో మావోయిస్టులు మహిళలనే అస్త్రంగా చేసుకున్నట్లు సమాచారం. 300 నుంచి 400 మంది మావోయిస్టులు దాడి చేసినట్లు చెబుతుండగా వీరిలో 70 శాతం మంది మహిళా మావోయిస్టులే ఉన్నట్లు గాయపడిన జవాన్లు పేర్కొంటున్నారు. నల్ల దుస్తులు, అత్యాధునిక ఎకె47 ఆయుధాలతో మహిళా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారని వారు చెబుతుండటం మారిన మావోల నూతన పంథాకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇదే దాడిలో రాకెట్ లాంచర్లు, గ్రెనేడ్లు, క్రూడ్ బాంబులతో మావోయిస్టులు దాడి చేసినట్లు క్షతగాత్రులు చెప్పడం మావోల ఘాతుకం వెనక ఉన్న వ్యూహాన్ని తెలియజేస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో మహిళా మావోయిస్టులు, ఇంత బరువైన ఆయుధాలతో బలగాలపై విరుచుకుపడటం గతంలో ఎప్పుడూ జరగలేదు. గతంలో మావోయిస్టులకు ఆదివాసీలే సైన్యంగా ముందుండేవారు. అయితే ఇటీవల కాలంలో బలమైన శత్రువును ఎదుర్కొనే క్రమంలో మావోయిస్టులు నిత్యం తమ పంథాను మార్చుకుంటున్నారు. సుక్మా జిల్లా బెజ్జిలో బాణానికి బాంబును అమర్చి పోలీసుల గుంపుపై వదలడం ద్వారా అది పేలి ఒకేసారి నలుగురిని హతమార్చడం అనే రణతంత్రాన్ని మావోయిస్టులు అవంబించారు. ముందుగా మందుపాతర పేల్చి, చెల్లాచెదురై ఒకచోటికి చేరిన పోలీసులను ఈ రాంబో విధానం ద్వారా మట్టుబెట్టారు. తాజాగా మహిళలను యుద్ధంలో ఎక్కువ శాతం ఉపయోగిస్తూ బలగాలను తేరుకోకుండా ఆత్మ రక్షణలో పడేస్తున్నారు.
భోజనానికి కూర్చోగానే కాల్పులు
‘నిర్మాణంలో ఉన్న రహదారి తనిఖీలు చేపట్టేందుకు రోజులాగే క్యాంపు నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొందరు గస్తీ కాస్తుండగా, మరి కొంతమంది భోజనం చేద్దామని కూర్చున్నారు. అంతలోనే గుంపుగా వచ్చిన మావోయిస్టులు చుట్టుముట్టారు. ఏం జరుగుతోందో జవాన్లకు అర్థమయ్యేలోగానే తుపాకులు ఎక్కుపెట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు’ అని ఛత్తీస్‌గఢ్ పోలీసు మావోయిస్టు ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ డిఎం అవస్థి తెలిపారు. బస్తర్‌లోని కాలాపత్థర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రహదారి వద్ద గస్తీ కాసేందుకు దాదాపు 100 మంది జవాన్లు వెళ్లారని, మావోయిస్టుల దాడిలో 25 మంది మృతి చెందారని తెలిపారు. భోజనానికి కూర్చున్న వారిపై కాల్పులు జరపడంతో తేరుకొని ప్రతి దాడి చేసే సమయం కూడా కొందరికి లేకుండా పోయిందని, గస్తీ కాస్తున్న బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో మావోయిస్టులు చెల్లాచెదురైనట్లు తెలిపారు. దాదాపు మూడు గంటల పాటు మావోయిస్టులతో జవాన్లు పోరాడినట్లు అవస్థి తెలిపారు.

దాడికి రామన్న సారథ్యం?
భద్రాచలం/ చింతూరు: ఈ ఘాతుకం మావోయిస్టుల దండకారణ్య కార్యదర్శి రామన్న సారథ్యంలోనే జరిగివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సుకుమా జిల్లా చింతలనార్ వద్ద 2010లో 76మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బందిని బలితీసుకున్న ఘటనలో రామన్న కీలకపాత్ర పోషించినట్టు పోలీసులు చెబుతున్నారు. భద్రతాబలగాలపై జరిగిన దాడితో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాల్లో పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులుగల ధర్మపేట, గొల్లపల్లి, ఎలకనగూడెం, పైడిగూడెం, గౌరూరు గ్రామాల్లోని సిఆర్‌పిఎఫ్ బేస్ క్యాంపులను అలెర్ట్‌చేశారు. దాడిజరిగిన ప్రదేశం వద్దకు భారీ సంఖ్యలో బలగాలను పంపి, దాడిజరిగిన తీరును అధికారులు విశే్లషిస్తున్నారు. మావోయిస్టుల దాడిలో మృతిచెందిన జవాన్ల ఫ్లెక్సీలతో మంగళవారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కుంటలో ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ పోలీసు అధికార్లు శాంతి ర్యాలీ నిర్వహించారు. చింతూరు ఒఎస్‌డి ఫకీరప్ప, డిఎస్పీ దిలీప్‌కిరణ్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు.