తెలంగాణ

సర్కారుకు ఎదురు దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒప్పంద సిబ్బంది
క్రమబద్ధీకరణ ఆపండి
హైకోర్టు మధ్యంతర
ఉత్తర్వులు జారీ
కేసు విచారణ
జూన్‌కు వాయిదా

హైదరాబాద్, ఏప్రిల్ 26: కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టు బ్రేక్ వేసింది. 1996 ఏప్రిల్ 10 తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమితులైన వారిని క్రమబద్ధీకరించరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్ట్ సిబ్బంది క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ జె శంకర్ రావు, కరీంనగర్‌కు చెందిన మరో వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన డివిజన బెంచ్ బుధవారం విచారించి ఈమేరకు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చట్ట వ్యతిరేకమని, ఈ విషయంలో కర్నాటక రాష్ట్రం వర్సెస్ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, తీర్పును పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. పదేళ్ళు సర్వీసు పూర్తిచేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా అన్యాయమని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు.
రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణా రెడ్డి ప్రభుత్వం తరఫున వాదిస్తూ రాష్ట్ర విభజనకు ముందు నుంచే కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను ఉపయోగించుకుంటున్నట్టు చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల విద్యార్హతలు, ఇతర అర్హతలను దృష్టిలో పెట్టుకుని క్రమబద్ధీకరిస్తున్నట్టు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం వివిధ విన్నపాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించిందని వివరించారు. ఐదు నుంచి పదేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి కమిటీ సిఫార్సు చేస్తున్నదని ఆయన తెలిపారు. ఇటువంటి అంశంపైనే ఇదివరకే దాఖలైన పిటిషన్ కోర్టు పరిశీలనలో ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాల్సిందిగా కోరారు.
ఇలాఉండగా పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్ ఎస్ సత్యం రెడ్డి వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పబ్లిక్ ఉద్యోగుల చట్టం-1994లోని సెక్షన్ 10-ఎను పరిగణలోకి తీసుకుని కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్టు చెప్పారు. సెక్షన్-10ఎ సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకమైందని చెబుతూ, 2006లో కర్నాటక ప్రభుత్వం వర్సెస్ ఉమాదేవి కేసును ప్రస్తావించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించబోమని ప్రభుత్వం ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారు. 1996 తర్వాత నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులిస్తూ, కేసును జూన్‌కు వాయిదా వేసింది.