తెలంగాణ

ఎల్లుండి ఉభయ సభల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: భూ సేకరణ సవరణ చట్టాన్ని ఆమోదించేందుకు ఆదివారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభమవుతుంది. శాసనమండలి, శాసన సభ ఆదివారం నాటి సమావేశం గురించి అసెంబ్లీ కార్యదర్శి పేరుతో బులెటిన్ విడుదలైంది. 29న సాయంత్రం నాలుగు గంటలకు బిఎసి సమావేశం జరుగుతుంది. 30న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం మొదలవుతుంది. మూడు గంటలకు శాసన మండలి సమావేశం ప్రారంభమవుతుంది. స్పీకర్ మధుసూదనాచారి బిఎసి సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి కెసిఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసన సభా వ్యవహారాల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు, వివిధ పక్షాల నాయకులు హాజరవుతారు. గవర్నర్ ప్రసంగ సమయంలో అభ్యంతరకరంగా వ్యవహరించారని సభ మొదటి రోజు నుంచే టిడిపి సభ్యులను మొత్తం సెషన్ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు జరుగుతున్నవి బడ్జెట్ సమావేశాలే కాబట్టి సెషన్ మొత్తం ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. దీని వల్ల భూసేకరణ చట్టానికి సవరణలపై చర్చలో సైతం టిడిపి సభ్యులు పాల్గొనే అవకాశం లేదు. భూ సేకరణ చట్టంలో కేంద్రం సూచించిన మార్పులతో అధికారులు ముసాయిదా సిద్ధం చేశారు. ఇదే సమావేశంలో కల్తీ నిరోధక చట్టాన్ని కూడా తీసుకు రానున్నారు.