తెలంగాణ

ఆందోళనకు వర్శిటీల అధ్యాపకులు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 26: ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యల సాధన కోసం తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల అధ్యాపకులు ఆందోళన బాట పట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టిఎస్‌ఎఫ్‌యుటిఎ) ఆధ్వర్యంలో ఆందోళనకు దిగాలని నిర్ణయించారు. ఉద్యమ కార్యాచరణను రూపొందించుకునేందుకు ఈ నెల 30వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో వర్శిటీల అధ్యాపకులందరితో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నామని అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ మామిడాల, కార్యవర్గ సభ్యుడు పెద్దోళ్ల శ్రీనివాస్‌లు తెలిపారు. తెలంగాణలోని దాదాపుగా అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ సంవత్సర కాలానికి పైబడి వైస్ ఛాన్స్‌లర్లను నియమించకపోవడం, నిధులను ఆశించిన స్థాయిలో కేటాయించకపోవడం, అధ్యాపక ఖాళీలను భర్తీ చేయకపోవడం, వర్శిటీల పట్ల పాలకులు శీతకన్ను ప్రదర్శిస్తున్నారనే అసంతృప్తితో ఆందోళనకు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నారు. ప్రధానంగా వి.సిల పోస్టులు భర్తీ చేయకపోవడం అనేక సమస్యలకు ఆస్కారం కల్పిస్తోంది. నిజానికి ప్రభు త్వం గత జనవరి మొదటి వారంలోనే రాష్ట్రంలోనే ఉస్మానియా యూనివర్శిటీతో పాటు కాకతీయ, డాక్టర్ బిఆర్. అంబేద్కర్, శాతవాహన, పాలమూరు, జెఎన్‌టియుతో పాటు నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయా ల వైస్ చాన్స్‌లర్ పోస్టుల భర్తీ కోసం ఉన్నత విద్యా మండలి ద్వారా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇదివరకటితో పోలిస్తే ఒకింత నిబంధనలు సడలించడంతో వి.సి పోస్టులను ఆశిస్తూ వందలాది మంది ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు.
ఒక్క నిజామాబాద్‌లోని తెలంగాణ వర్శిటీ వి.సి పోస్టు కోసమే దాదాపు 200వరకు దరఖాస్తులు దాఖలయ్యాయంటే పోటీ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయితే వివిధ కారణాల వల్ల ప్రభుత్వం వి.సి పోస్టుల నియామక ప్రక్రియను చేపట్టకపోవడంతో ఖాళీలు అలాగే ఉండిపోయాయి. ప్రస్తుతం ఇన్‌చార్జి వి.సిలతోనే ఎలాగోలా నెట్టుకొస్తున్నారు.