తెలంగాణ

జన సంద్రమైన ఓరుగల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్‌లో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ జన సంద్రంగా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్‌లో నిర్వహించిన భారీ సభలకంటే ఎక్కువ జనం తరలివస్తారన్న టిఆర్‌ఎస్ అంచనాలకు తగినట్టుగానే దాదాపు 10 లక్షల మంది హాజరుకావడంతో సభాస్థలి కిక్కిరిపోయింది. రైతుల కోసం ముఖ్యమంత్రి ప్రకటించిన వరాలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి మునుపెన్నడూ లేని విధంగా రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రైతులు తాము ఉపయోగించే ట్రాక్టర్లనే ఎడ్లబండ్ల మాదిరిగా ముస్తాబు చేసుకొని సభకు తరలిరావడంతో మేడారం జాతరను తలపించింది. దాదాపు10 వేల ట్రాక్టర్లు సభకు వచ్చినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వాహనాలు, ట్రాక్టర్లతో గురువారం మధ్యాహ్నం వరకే వరంగల్ నగరంలోని రోడ్లన్ని నిండిపోయాయి. దారిపొడవునా ఎక్కడా చూసిన సభకు తరలివచ్చిన వాహనాలు చీమల బారుల్లా వరంగల్ వైపు సాగడంతో అన్ని వైపుల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్-వరంగల్ రహదారిపై ఆలేరు నుంచి జనగామ వరకు, స్టేషన్ ఘనపూర్ నుంచి కాజీపేట వరకు ట్రాఫిక్‌జామ్ కావడంతో ఆ దారిన సభకు బయలుదేరిన మంత్రులు కెటి రామారావు, జగదీశ్‌రెడ్డి ట్రాఫిక్ జామ్‌లో రెండు గంటలపాటు చిక్కుకు పోయారు. కరీంనగర్ నుంచి వచ్చే దారిలో ఎల్కతుర్తి నుంచి హసన్‌పర్తి వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వేలాది మంది సభకు రాకుండా మార్గమధ్యంలో ఆగిపోయారు.
వరంగల్ వైపు వచ్చే రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయిన దృశ్యాన్ని హెలికాప్టర్ ద్వారా వీక్షించిన ముఖ్యమంత్రి పోలీసు అధికారులను ఆదేశించి క్లియర్ చేయించారు. దీంతో ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకు పోయిన వాహనాలు సభాస్థలికి చేరుకున్న తర్వాతనే ముఖ్యమంత్రి ఆలస్యంగా 7.15 గంటలకు సభాస్థలికి చేరుకున్నారు.

చిత్రం..వరంగల్ లో జన సంద్రమైన ఆవిర్భావ సభాస్థలి