తెలంగాణ

అక్కడక్కడ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: వేసవి తీవ్రతతో తల్లడిల్లుతున్న రాష్ట్ర ప్రజలు మరో (మే) నెల ఎలా గడుస్తుందా? అని ఆందోళన చెందుతున్నారు. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో సాధారణ ఉష్ణ్రోగ్రతల కంటే మరో 3 నుంచి 5 సెల్సి యస్ డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోద య్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ వైకె రెడ్డి తెలిపారు. కాగా శుక్రవారం సాయంత్రం అనూహ్యంగా వాతావరణం చల్లబడింది. తెలంగాణలో అక్కడక్కడా చిరు జల్లులు కురవగా, వికారాబాద్‌లో వడగండ్ల వాన బీభత్సాన్ని సృష్టించింది. అక్కడ 9.25 మిమీ వర్షపాతం నమోదైంది. తాండూరులో అకాల వర్షంతో ప్రజ లు ఇబ్బంది పడ్డారు. అలాగే హైద రాబాద్‌లోని అంబర్‌పేటలో 3.5 మి.మీ, నాంపల్లిలో 2.5 మి.మీ, బేగంపేటలో 2 మి.మీ, నగర శివారులోని యాచారంలో 2.25 మి.మీ, నవాబ్‌పేటలో 37.2 మి.మీ, మిడ్జిల్‌లో 15.5 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. వచ్చే వారంలో దక్షిణ తెలంగాణలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వైరాలో 46.5 డిగ్రీలు
ఇదిలాఉండగా, ఖమ్మం జిల్లా వైరాలో శుక్రవారం అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా, పాల్వంచలో 45.4 డిగ్రీ లు, ముదిగొండలో 45.3 డిగ్రీలు, పెనుబల్లిలో 45.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
సంతోషించిన నగర వాసులు
హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం మబ్బులు కమ్ముకుని అక్కడక్కడా చిరు జల్లులు పడడంతో నగర ప్రజలు సంతోషించా రు. అయితే ఉద్యోగాలు, వ్యాపారాలు ముగించుకుని ఇళ్లకు తిరుగు పయనమైన వారు మాత్రం అకాల వర్షంతో ఇబ్బంది పడ్డారు.