తెలంగాణ

అబద్ధాన్నీ నిజంగా నమ్మిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: మతపరమైన రిజర్వేషన్లతో తెరాస ప్రభుత్వం రాష్ట్రంలోని ఎస్సీ, బిసిలకు ద్రోహం తలపెడుతోందని, ఇది చారిత్రాత్మక తప్పిదమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. కెసిఆర్ సర్కా రు కుట్రపూరితంగానే ఎస్టీ, ముస్లింల రిజర్వేషన్లను ఒకే బిల్లులో చేర్చిందని ఆయన ఆరోపించారు.
వాక్చాతుర్యాన్ని ఆయుధంగా వాడుకుంటున్న కెసిఆర్ ఈమధ్య రైతుల పాట పాడుతున్నారని, నిన్న చెప్పిన మాట ఈరోజు చెప్పడం లేదని, అబద్దాన్ని కూడా నిజం అని నమ్మించే వాక్పటిమ ఆయనకు ఉందని లక్ష్మణ్ అన్నారు. గత కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తీసిపోని విధంగా తెరాస పాలన కొనసాగుతోందని, దానికి తోడు మతతత్వ ఎంఐఎం అజెండాను కూడా కెసిఆర్ అమలుచేస్తున్నారని ఆయన విమర్శించారు.
కిసాన్ మోర్చ కమిటీ
ఇదిలావుంటే, బిజెపి అను బంధ సంఘమైన కిసాన్ మోర్చ కమిటీని ఆ సంఘం అధ్యక్షుడు గోలి మధుసూధనరెడ్డి ప్రకటించారు. కార్యాలయ కార్యదర్శిగా ఎస్.నర్సింహరెడ్డి, కోశాధికారిగా కాశి ప్రకాష్, ప్రధానకార్యదర్శులుగా పాపయ్య గౌడ్, నర్సింహ నాయుడు, వి.సుదర్శన్‌రెడ్డి, కార్యదర్శులుగా మల్లేష్ యాద వ్, మనె్న ప్రతాప్‌రెడ్డి, పోడుగంటి రామదాస్, ఎం పురుషోత్తం రావు, కనగాల నారాయణ, ఎం.అంజయ్య యాదవ్, ఎం.గణేష్ ముదిరాజ్, కోమటిరెడ్డి భగవాన్‌రెడ్డిలను నియమించారు. ఉపాధ్యక్షులుగా బి.రాజేంద్రరెడ్డి, పి.అర్జున్‌రెడ్డి, ఎం.రా మచంద్రారెడ్డి, నంద్యాల శ్రీనివాస్, కాసర్ల జనార్ధనరెడ్డి, కోట కమలాకర్‌రెడ్డి, వై.పెంటయ్య, ఎస్.వెంకటరెడ్డిలను నియమించారు. 9 మందిని అధికార ప్రతినిధులుగా, మరో 28 మందిని ఇతర పదవుల్లో నియమించారు.