తెలంగాణ

సిఆర్‌పిఎఫ్‌కు గ్రేహౌండ్స్ తరహా శిక్షణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: కేంద్ర సాయుధ పోలీసు దళం (సిఆర్‌పిఎఫ్)కు వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు గ్రేహౌండ్స్ తరహాలో శిక్షణ ఇచ్చే దిశగా ఆ శాఖ తీవ్రంగా యోచిస్తోంది. చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టుల చేతిలో 26 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మృతి చెందిన సంఘటనను ఆంధ్ర, తెలంగాణ గ్రేహౌండ్స్ అధికారులు తీవ్రంగా విశే్లషిస్తున్నారు. గ్రేహౌండ్స్ శిక్షణ సంస్థలో నక్సలైట్ల ఏరివేతకు ఇచ్చే శిక్షణ తరహాలో తమ బలగాలకు శిక్షణ ఇచ్చే విషయమై సిఆర్‌పిఎఫ్ అధికారులు ఏపి, తెలంగాణ గ్రేహౌండ్స్‌ను సంప్రదించినట్లు సమాచారం. దీనిపై కేంద్రహోంశాఖ చొరవ తీసుకుని ఒక విధానాన్ని త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలిసింది.
వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేసేందుకు ఉమ్మడి ఎపి ప్రభుత్వం పోలీసు శాఖలోగ్రేహౌండ్స్ విభాగాన్ని 1989లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇందుకు ప్రత్యేక శిక్షణ, మెళకువలతో కూడిన శిక్షణ కార్యక్రమాన్ని ఎపి ప్రభుత్వం రూపకల్పన చేసి అమలు చేసింది. అడవుల్లో పోరాటంపై ప్రధానంగా గ్రేహౌండ్స్ బలగాలకు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత క్రమేణా గ్రేహౌండ్స్ బలగాల ధాటికి తట్టుకోలేక వామపక్ష తీవ్రవాదులు పక్క రాష్ట్రాల్లో తలదాచుకున్నారు. గ్రేహౌండ్స్ బలగాలు వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడంలో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాయి. కూంబింగ్, ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్, అడవుల్లో సంచరిస్తూ మావోల కదలికలపై ఎప్పటికప్పుడు కనే్నసే విధంగా శిక్షణను ఇవ్వడంతో గ్రౌహౌండ్స్ దళం అనుకున్న విజయం సాధించింది. సిఆర్‌పిఎఫ్ జవాన్లకు మావోలను ఎదుర్కొనేందుకు శిక్షణ ఇస్తున్నప్పటికీ పూర్తిగా ఒక్క మావోయిస్టులనే ఎదుర్కొనేందుకు అవసరమైన శిక్షణ లోపించినట్లు, దీని వల్ల మావోయిస్టుల చేతిలో సిఆర్‌పిఎఫ్ బలగాలు బలవుతున్నట్లు గ్రేహౌండ్స్, ఎస్‌ఐబిలో పనిచేసిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సుకుమా జిల్లాలో ఘటన జరిగిన ప్రదేశం ఆంధ్ర సరిహద్దుకు 40 కి.మీ, తెలంగాణ సరిహద్దు 110 కి.మీ దూరంలో ఉంది. సుకుమా సంఘటనలో సిఆర్‌పిఎఫ్ జవాన్లు కౌంటర్ వ్యూహాన్ని అమలు చేయడంలో ఎక్కడ విఫలమయ్యారనే అంశంపై సీరియస్‌గా ఆ శాఖ విశే్లషిస్తోంది. ప్రస్తుతం సిఆర్‌పిఎఫ్ వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన మూడు చోట్ల ఎంపిక చేసిన తమ జవాన్ల కోసం ఆరు వారాల శిక్షణ ఇస్తోంది. ఈ మూడు ప్రాంతాల్లో ఎపిలోని చిత్తూరు కూడా ఉంది. ఫిజికల్ ఫిట్‌నెస్, ఆయుధ వినియోగం, అవసరాన్ని బట్టి అనుసరించాల్సిన టెక్నికల్ ఆపరేషన్స్ వ్యూహం కోణంలో శిక్షణ అందిస్తోంది. కానీ సిఆర్‌పిఎఫ్ తన జవాన్లకు ఈ శిక్షణ సరిపోవడం లేదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముందస్తు నిఘా సమాచార సేకరణ (ఇంటిలిజెన్స్ గేదరింగ్)లో సిఆర్‌పిఎఫ్ వైఫల్యం కనిపిస్తున్నట్లు గుర్తించింది.ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న గ్రేహౌండ్స్ విభాగంలో శిక్షణ ఇప్పించే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. సుకుమా ఘటనలో స్థానిక పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో మావోలకు దాడి చేసేందుకు అవకాశం చిక్కిందని భావిస్తోంది. సహజంగా స్థానికంగా ఉన్న పోలీసు నెట్‌వర్క్, ఎస్‌బి విభాగాలకు మావోల సంచారం, కదలికల సమాచారం చాలావరకు తెలుస్తుంది. వారి నుంచి కూంబింగ్ ఆపరేషన్స్‌లో ఉన్న సిఆర్‌పిఎఫ్ కమెండోలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.