తెలంగాణ

తెలంగాణకు వర్తించని రియల్ ఎస్టేట్ చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని, చట్టాన్ని నిర్దేశించిన కాలపరిమితిలో నోటిఫై చేయడంలో జాప్యం చేసింది. దీని వల్ల దేశ వ్యాప్తంగా మే 1వ తేదీ నుంచి అమలు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు స్థానం లభించలేదు. ఆంధ్రప్రదేశ్ మాత్రం రియల్ ఎస్టేట్ అథారిటీ చట్టాన్ని గత ఏడాది ఆమోదించడం విశేషం. రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ చట్టం 2016 కింద అన్ని రాష్ట్రప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలి. ఈ చట్టం నిరుడు అమలులోకి వచ్చింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 2017 మే 1వ తేదీ నుంచి చట్టబద్ధం గా అమలు చేయాలని కేంద్రం నిర్దేశించింది. ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు ఈ విషయమై సమీక్షించారు. దేశంలో ఇతర రాష్ట్రా లు, కేంద్రపాలిత ప్రాంతాలు చేసిన చట్టాలను తెప్పించుకుని అధికారులు అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ చట్టంపై రాష్ట్రం ముసాయిదా నిబంధనలను రూపొందించాల్సి ఉంది. వీలైనంత త్వరలో ముసాయిదా ప్రతిని తయారు చేసి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది. రాష్ట్ర అసెంబ్లీలో తొలుత ముసాయిదా బిల్లు ఆమోదం పొందాల్సి ఉం టుంది. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి. రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలోని అందరు బిల్డర్లు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులేటరీ అథారిటీలో నమోదు చేసుకోకుండా ప్రకటనలు ఇవ్వడం, మార్కెటింగ్, బుకింగ్ చేయడం, విక్రయించడాన్ని నిషేధించారు. సకాలంలో ఒప్పం దం మేరకు ఇంటి నిర్మాణం పూర్తి చేసి అప్పగించని పక్షంలో బిల్డర్‌పై రెగ్యులేటరీ అథారిటీని వినియోగదారులు సంప్రదించవచ్చును. అపార్టుమెంటు లేదా ఇంటిలో ఒప్పందంలో ఉన్న సదుపాయాలు కల్పించలేకపోయినా అథారిటీలో బిల్డర్‌పై వినియోగదారులు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.