తెలంగాణ

సభలో శివాలెత్తిన ఒవైసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: హెచ్‌సియు, ఒయూ వర్శిటీల అంశాలను చర్చకు అనుమతించాలని శాసనసభలో శనివారం ఎంఐఎం శాసససభాపక్ష నేత ఒవైసీ పట్టుబడుతుండగా మైక్ కట్ అయింది. దీంతో ఆగ్రహం చెందిన ఒవైసీ మైక్ కట్ చేసినా మాట్లాడసాగారు. తన స్ధానం నుంచి బయటకు వచ్చి చేతులు ఊపుతూ ఆవేశంగా మాట్లాడారు. ఆ మాటలు ఏవీ రికార్డు కాలేదు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, ఒవైసీ గారూ ‘మీకేం కావాలో చెప్పండి. అంతే కాని అంశాలను వివాదస్పదం చేసి తప్పుగా మాట్లాడకండి, మీ సభ్యులను వెల్‌లో నుంచి వెనక్కు రావాలని ఆదేశించండి, గొడవ చేయవద్దు, మీరు లెవనెత్తే అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని చెప్పారు. ఈ సందర్భంగా కెసిఆర్ పలుసార్లు ఆవేశంతో ఊగిపోతున్న ఒవైసీని సముదాయించేందుకు చాలా ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వెల్‌లో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, మజ్లిస్, టిడిపి సభ్యులున్నారు. ఒవైసీ మాత్రం ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తిని ఖాతరు చేయకుండా తన మైక్‌ను కట్ చేసినందుకు ఆవేశంగా మాట్లాడసాగారు. అనంతరం కెసిఆర్ జోక్యం చేసుకుని ‘ఒవైసీకి మాట్లాడేందుకు మైక్ ఇవ్వండి, కాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడనివ్వద్దు’ అని డిప్యూటీ స్పీకర్‌ను కోరారు. అప్పటికీ సభ సద్దుమణగపోవటంతో డిప్యూటీ స్పీకర్ సభను కొద్ది సేపు వాయిదా వేశారు.