తెలంగాణ

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/శేరిలింగంపల్లి, ఏప్రిల్ 30: హైదరాబాద్ చందానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగారంలో ఆదివారం వెలుగుచూసింది. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన వేములపల్లి వినీలకు, హైదరాబాద్‌కు చెందిన విక్రమ్ జయసింహతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. కాగా వీరికి ఇద్దరు నాలుగేళ్లు, మూడేళ్ళు సంతానం. కాగా స్థానిక గంగారంలోని అరుణోదయ రెసిడెన్సీలో ఫ్లాట్ నెం. 4లో నివాసముంటోన్న వినీల (25) ఓ ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది. భర్త విక్రమ్ ప్రైవేట్ ఉద్యోగి కాగా విక్రమ్ షేర్ మార్కెట్లో తీవ్రంగా నష్టపోయాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి గం. 11.30లకు వినీల ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అదనపు కట్నం కోసం భర్త వేధింపులే వినీల ఆత్మహత్యకు కారణమంటూ ఆమె తల్లి వేములపల్లి ఉదయలక్ష్మి ఆదివారం చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఇన్‌స్పెక్టర్ ఎన్.తిరుపతిరావు, ఎస్‌ఐ వేణు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఘటన వివరాలు తెలుసుకున్నారు. కాగా ఆదివారం గాంధీ ఆసుపత్రిలో శేరిలింగంపల్లి డిప్యూటి కలెక్టర్ ఎస్.తిరుపతిరావు సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు. అదనపుకట్నం కోసం భర్తతో పాటు అత్త వాణి మానసికంగా, శారీరకంగా వేధించడంవల్లే వినీల ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి వేములపల్లి ఉదయలక్ష్మి ఆరోపించింది. తల్లి మరణంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు మియాపూర్ ఎసిపి సంక్రాంతి రవికుమార్ తెలిపారు.