తెలంగాణ

దద్దరిల్లిన అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, ఉస్మానియా యూనివర్శిటీలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై తెలంగాణ శాసనసభ శనివారం దద్దరిల్లింది. ఈ అంశంపై కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడంతో విపక్షాలు వెల్‌లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశాయి. తొలుత శాసనసభ ప్రారంభమైన వెంటనే నల్లకండువాలతో వచ్చిన కాంగ్రెస్ సభ్యులు హెచ్‌సియు, ఓయు వర్శిటీ ఘటనలపై చర్చ జరగాలని, ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి ఈ అంశాలపై చర్చకు చేపట్టాలన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌పై ఓయూలో పోలీసులు దౌర్జన్యం చేశారని, దీనిపై కూడా చర్చ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యుల డిమాండ్‌కు మజ్లిస్, సిపిఐ, టిడిపి సభ్యులు మద్దతు పలికారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం సజావుగా జరిగేందుకు సహకరించాలని, కాంగ్రె స్ సభ్యులు సరైన నిబంధన కింద వస్తే వారు లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. హోంశాఖ పద్దులపై చర్చ ఉందని, ఈ పద్దు కింద హెచ్‌సి యు, ఓయూ ఘటనలపై చర్చించాలని కోరారు. బిజెపి శాసనసభాపక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ హోం శాఖ పద్దుల కింద ఈ అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించగా, మిగిలిన విపక్షాలు ససేమిరా అన్నాయి. సిఎల్‌పి నేత కె జానారెడ్డి మాట్లాడుతూ, తాము ప్రస్తావించిన అంశాల ప్రాధాన్యత దృష్ట్యా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి చర్చకు అనుమతించాలని కోరారు. దీనికి డిప్యూటీ స్పీక ర్ అనుమతించకపోవడంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. మూడోసారి సభ ప్రారంభమైనప్పుడూ కూడా సభలో అవే సన్నివేశాలు పునరావృతమయ్యాయి.
నినాదాలు పద్ధతి కాదు: కెసిఆర్
సభలో ప్రతిపక్షాలు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేయడం పద్ధతి కాదని, ఏ అంశంపైనా నిబంధనల కింద చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. సభ రెండుసార్లు వాయిదా పడి సమావేశమైన తర్వాత ఆయన జోక్యం చేసుకుని మాట్లాడుతూ కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ తనపై పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని తాము ఖండిస్తున్నామని, కాని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయనేలేదని కెసిఆర్ అన్నా రు. తమది దళిత వ్యతిరేక ప్రభుత్వమని నినాదాలు చేసిన వ్యక్తి ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. సిఎల్‌పి నేత జానారెడ్డి మాట్లాడుతూ సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాలు కాబట్టి చర్చకు అనుమతించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంఐఎం శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ దళితుల గొంతు వినిపిస్తామని, ఈ అంశంపై చర్చకు అనుమతించాలని కోరారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ జోక్యం చేసుకుని మాట్లా డే ప్రయత్నం చేయగా, ఒవైసీ మైక్ కట్ అయింది. దీంతో మజ్లిస్ ఎమ్మెల్యేలు వెల్‌లోకి వెళ్లారు. అనంతరం సభను డిప్యూటీ స్పీకర్ వాయిదా వేశారు. మళ్లీ మూడోసారి సభ సమావేశమైన తర్వాత కూడా ఇదే పరిస్ధితులు పునరావృతం కావడంతో సభ మూడోసారి వాయిదా పడింది.