తెలంగాణ

విద్యారంగంలో సామర్థ్యాల పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: దేశంలో విద్యా రంగంలో సామర్ధ్యాల పెంపునకు, పరిశోధనలకు, ప్రణాళికల రూపకల్పనకు ‘న్యూపా’ పెద్ద ఎత్తున కృషి చేస్తున్నట్టు ఆ సంస్థ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ ఆర్ మాధవ మీనన్ పేర్కొన్నారు. విద్యారంగంలో ప్రమాణాలు పెరిగినా, అంతర్జాతీయ పోటీకి ధీటుగా మరింత సంస్కరించబడాలని ఆయన పేర్కొన్నారు. సోమవారం రాత్రి జరిగిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ 21వ స్నాతకోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 1,32,475 మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ స్నాతకోత్తర పట్టాలను అందించారు. 87,156 మందికి బిఎ, 13,947 మందికి బికాం, 13,349 మందికి బిఎస్సీ డిగ్రీలు ఇస్తామని, 20 మందికి ఎంఫిల్, 76 మందికి పిహెచ్‌డి కలిపి మొత్తం 1,32,475 మందికి డిగ్రీలు ప్రదానం చేశారు. చర్లపల్లి, రాజమండ్రి, వరంగల్, కడప జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు 381 మంది స్నాతకోత్సవం సందర్భంగా డిగ్రీలు పొందారు. అందులో 361 మంది పురుషులు, 20 మంది మహిళలున్నారు. 45 మంది యుజి, 98 మంది పిజి విద్యార్ధులు సహా 143 మందికి బంగారు పతకాలు అందించారు. ఇందులో బనులు శివకుమారి అనే అమ్మాయి నాలుగు బంగారు పతకాలు గెలుచుకోగా, కుమర్ సుల్తానా మూడు, సయ్యద్ నిఖాత్ ఫాతిమా మూడు, కోట మణిరామ్ కుమార్, నాగమణి బసవ, మహేశ్వరి సుధారాణి, పి పాండురంగ, కె ఉమా మహేశ్వరి, గౌతమి ఉప్పల, కీర్తి ప్రేమ్‌చంద్ర, బి శ్రీలక్ష్మీ, కె రామతులసి, పి నళిని రెండు రెండు చొప్పున బంగారు పతకాలు పొందారు.
ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు యూనివర్శిటీ కార్యకలాపాలను విస్తరిస్తున్నామని చెప్పారు. త్వరలో ఇ- లెర్నింగ్ పోర్టల్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నట్టు ఆయన తెలిపారు. ఆడియో, వీడియో పాఠాలను ఎప్పటికపుడు నేర్చుకునేందుకు ఇది వీలు కల్పిస్తుందని తెలిపారు. తాము ఆఫర్ చేస్తున్న బిఎస్సీ కోర్సు దేశంలోనే ఉత్తమమైనదిగా గుర్తింపు పొందిందని చెప్పారు. యూనివర్శిటీలో 17 కోర్సులను కొత్తగా ప్రారంభించనున్నామని అన్నారు. రానున్న రోజుల్లో యూనివర్శిటీ పెద్ద ఎత్తున డిజిటలీకరణకు వెళ్లబోతోందని, విద్యార్థులకు ఓపెన్ ఎడ్యుకేషన్ రీసోర్సెస్, ఇ రిపోజిటరీ, పోర్టుల్స్, డిజిటల్ లైబ్రరీల ద్వారా పెద్ద ఎత్తున అభ్యసన అవకాశాలను కల్పించనున్నట్టు పేర్కొన్నారు. ప్రధానంగా విద్యార్ధులకు సేవలను అందించే విషయంలో అనేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.